Dorakuna Ituvanti

దొరకునా
దొరకునా
దొరకునా

దొరకునా ఇటువంటి సేవ
దొరకునా ఇటువంటి సేవ
నీ పదరాజీవముల చేరు
నిర్వాణసోపానమధిరోహణము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ
నీ పదరాజీవముల చేరు
నిర్వాణసోపానమధిరోహణము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ

రాగాలనంతాలు నీ వేయి రూపాలు
భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు
రాగాలనంతాలు నీ వేయి రూపాలు
భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు
నాదాత్మకుడవై

నాలోన చెలగి
నా ప్రాణదీపమై నాలోన చెలిగి

నాదాత్మకుడవై నాలోన చెలిగి
నా ప్రాణదీపమై నాలోన వెలిగే
నిను కొల్చువేళ దేవాదిదేవా
దేవాదిదేవా

దొరకునా ఇటువంటి సేవ
నీ పదరాజీవముల చేరు
నిర్వాణసోపానమధిరోహణము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ

ఉచ్చ్వాసనిశ్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలు యదలోని సడులే మృదంగాలు

ఉచ్చ్వాసనిశ్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలు యదలోని సడులే మృదంగాలు
నాలోని జీవమై నాకున్న దైవమై
వెలుగొందు వేళ మహానుభావా
మహానుభావా

దొరకునా
సేవ
నీ పదరాజీవముల చేరు
నిర్వాణసోపానమధిరోహణము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ
దొరకునా ఇటువంటి సేవ



Credits
Writer(s): Sundara Rama Murthy Veturi, K V Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link