Chirunavvula Tholakarilo

చిరు నవ్వుల తొలకరిలో
సిరి మల్లెల చినుకులలో
పలికెనులే హృదయాలే
పలికెనులే హృదయాలే
తొలి వలుపుల కలయికలో

చిరు నవ్వుల తొలకరిలో
సిరి మల్లెల చినుకులలో
వసంతాలు దోసిట దూసి
విసిరేను నీ ముంగిలిలో
తారలనే దివ్వెలు చేసి
వెలిగింతు నీ కన్నులలో
నీవే నా జీవనాడిగా
నీవే నా జీవనాడిగా
ఎగిసేను గగనాల అంచులలో
ఓ విరియునులే ఆ గగనాలే
నీ వెన్నెల కౌగిలిలో

చిరు నవ్వుల తొలకరిలో
సిరి మల్లెల చినుకులలో
ఉరికే సెలయేరులన్నీ
ఓదిగిపోవు నీ నడకలలో
ఉరిమే మేఘాలన్నీ
ఉలికి పడును నీ పలుకులలో
నీవే నా పుణ్యమూర్తిగా
నీవే నా పుణ్యమూర్తిగా
ధ్యానించు నా మధుర భావనలో
ఓ మెరియునులే ఆ భావనలే
ఇరు మేనుల అల్లికలో

చిరు నవ్వుల తొలకరిలో
సిరి మల్లెల చినుకులలో
ఆ పలికెనులే హృదయాలే
తొలి వలుపుల కలయికలో
చిరు నవ్వుల తొలకరిలో
సిరి మల్లెల చినుకులలో



Credits
Writer(s): Dr. C Narayana Reddy, Pendyalaya Nageswara Rao
Lyrics powered by www.musixmatch.com

Link