Nenunnanani

చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నానని... నీకేంకాదని
నిన్నటి రాతని... మార్చేస్తానని

తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని
తరిమే వాళ్ళని హితులుగ తలచి ముందుకెళ్ళాలని

కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని
కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలని
గుండెతో ధైర్యం చెప్పెను
చూపుతో మార్గం చెప్పెను
అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని
నేనున్నానని... నీకేంకాదని
నిన్నటి రాతని... మార్చేస్తానని

ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని
అందరు ఉన్నా ఆప్తుడ నువ్వై చేరువయ్యావని
జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావని
జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నావని
శ్వాసతో శ్వాసే చెప్పెను
మనసుతో మనసే చెప్పెను
ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని
నేనున్నానని... నీకేంకాదని
నిన్నటి రాతని... మార్చేస్తానని

చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నానని... నీకేంకాదని
నిన్నటి రాతని... మార్చేస్తానని



Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link