Ishtapadi Ishtapadi

ఇష్టపడి ఇష్టపడి నిన్నే చేరుకున్నా మనసుపడి
కష్టపడి కష్టపడి నిన్నే కలుసుకున్నా మదనపడి
ప్రేమ ప్రేమ నన్ను దాచుకోవా
ప్రేమ ప్రేమ నన్ను గెలుచుకోవా
గుండె లోతు నుండి గొంతులోకి చేరి మాటలాగా మారే కొంటె ప్రేమ
మాటలన్నీ మరచి చాటు మాటు చూసి ముద్దులాగా మారే జంట ప్రేమ
ఇష్టపడి ఇష్టపడి నిన్నే చేరుకున్నా మనసుపడి
కష్టపడి కష్టపడి నిన్నే కలుసుకున్నా మదనపడి

ఇరువురి నడుమన తెరలను తెరిచిన ప్రేమే వరము సుమా
పెదవుల గడపన ప్రమిదలు నిలిపిన ప్రేమే మనసుల మహిమా
చూపులనే సైగలుగా మార్చేదే ఈ ప్రేమ
చేతులనే కౌగిలిగా మలచేదే ఈ ప్రేమ
చలిలోన చమరింత ప్రేమే సుమా
కాలిగోటి నుండి పూల కొప్పుదాక నిండి పోయెనమ్మ పిల్ల ప్రేమ
నేల మీద నుండి నీలి నింగిదాక నిచ్చెనేసేనమ్మా పిచ్చి ప్రేమ
ఇష్టపడి కష్టపడి నిన్నే చేరుకున్నా మనసుపడి
కష్టపడి ఇష్టపడి నిన్నే కలుసుకున్నా మదనపడి

మనసను చెరకును చితిమితే చిందిన తీపే ప్రేమ సుమా
వయసను వాగున వరదగ పొంగిన ప్రేమను ఆపగ తరమా
శ్వాసలలో సూర్యుడినే ఉడికించే ఈ ప్రేమ
దోసిలిలో చంద్రుడినే కొలువుంచే ఈ ప్రేమ
అరుదైన అనుభూతి ప్రేమే సుమా
ఎంత కాలమైన, ఎన్ని జన్మలైన నిన్ను నమ్ముతుంది కన్నె ప్రేమ
ఎంత దూరమైనా, ఎంత భారమైన నిన్ను కోరుతుంది కుర్ర ప్రేమ
ఇష్టపడి ఇష్టపడి నిన్నే చేరుకున్నా మనసుపడి
కష్టపడి కష్టపడి నిన్నే కలుసుకున్నా మదనపడి
ప్రేమ ప్రేమ నన్ను దాచుకోవా
ప్రేమ ప్రేమ నన్ను గెలుచుకోవా
గుండెలోతు నుండి గొంతులోకి చేరి మాటలాగా మారే కొంటె ప్రేమ
మాటలన్నీ మరచి చాటు మాటు చూసి ముద్దులాగా మారే జంట ప్రేమ
ఇష్టపడి ఇష్టపడి నిన్నే చేరుకున్నా మనసుపడి
కష్టపడి కష్టపడి నిన్నే కలుసుకున్నా మదనపడి

Credits
Writer(s): K S Chandra Bose, Gilla Chakradhar
Lyrics powered by www.musixmatch.com

Link