Kinnerasaani - Original

చిత్రం: సితార
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి

తననననన తననననన తననననన తననననన
తననననన తననననన తననననన తననననన
చమకు చమకు జింజిన జింజిన
చమకు చమకు జిన్న జిన్న జిన్న
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
జమకు జమకు జింజిన జింజిన
జమకు జమకు జిన్న జిన్న జిన్న
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
విశ్వనాధ పలుకై అది విరుల తేనె చినుకై
కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై
పచ్చని చేలా తనననన పావడగట్టి తనననన
పచ్చని చేలా పావడగట్టి కొండమల్లెలే కొప్పునబెట్టీ
వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని!!
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి

ఎండలకన్నే సోకని రాణి పల్లెకు రాణి పల్లవపాణి
కోటను విడిచీ పేటను విడిచీ కోటను విడిచీ పేటను విడిచీ
కలలా గంగా పొంగే వేళా నదిలా తానే సాగే వేళ
రాగాల రాదారి పూదారి ఔతుంటే!!
ఆ రాగాల రాదారి పూదారి ఔతుంటే!!
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి

మాగాణమ్మా చీరలు నేసే మలిసందెమ్మ కుంకుమపూసే
మువ్వులబొమ్మా ముద్దులగుమ్మా
మువ్వులబొమ్మా ముద్దులగుమ్మా
గడప దాటి నడిచే వేళ అదుపే విడిచీ ఎగిరే వేళ
వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే...
ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే!!
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
విశ్వనాధ పలుకై అది విరుల తేనె చినుకై
కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై
పచ్చని చేలా తనననన
పావడగట్టి తనననన
ఓయ్ పచ్చని చేలా పావడగట్టి
అ కొండమల్లెలే కొప్పునబెట్టీ
వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని!!
వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని!!



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, Ilaiyaraaja
Lyrics powered by www.musixmatch.com

Link