Yedhi Yedhi (From "Yeto Vellipoyindhi Manasu")

ఏది ఏది కుదురేది ఏది
ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో
లోతుల్లో జరిగేది
మాటల్లో అనలేక
పెదవే పేదై నీదై ఉంటే

ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో

నే ఓడే ఆట
నీ వాదం అంటా
ఎంతో ఇష్టంగా
నే పాడే పాట
నీ పేరేనంటా చాలా కాలంగా
నాకంటూ ఉందా ఓ ఆశ
నీ ఆశే నాకు శ్వాస
ఊహ ఊసు నీతోనే నింపేసా
నీ అందం ముందుంటే
ఆనందం రమ్మంటే
కలలే కళ్ళై చూస్తూ ఉంటే

ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో

నా కాలం నీదే
నువ్వై గడిపేసేయ్ ఎన్నాళ్లౌతున్నా
ఓహో నీ పాఠం నేనే
నన్నే చదివేసెయ్ అర్ధం కాకున్నా
నా లోకం నిండా నీ నవ్వే
నాలోను నిండా నువ్వే
తీరం దారి దూరం నువ్వయ్యావే
నా మొత్తం నీదైతే
నువ్వంతా నేనైతే
మనలో నువ్వు నేను ఉంటే

ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో

లోతుల్లో జరిగేది
మాటల్లో అనలేక
పెదవే పేదై నీదై ఉంటే
ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో



Credits
Writer(s): Ilaiyaraaja, Anantha Sriram
Lyrics powered by www.musixmatch.com

Link