Anjali Anjali (From "Duet")

అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి, ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి

నిన్నదాక నువ్వు నేను ఇరువురం ఎవరనీ
కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని
కడలిని పడు వానలా కలిసిన మది ఇది
కరిగిన సిరి మోజులా కథ ఇది నా చెలి
ఎదురుగ తొలి స్వప్నం తొణికినది
ఎదలో మధు కావ్యం పలికినది
అంజలి అంజలి వలపుల నా చెలి
పూవంటి పదములకు పుష్పాంజలి, ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి, ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి

కన్నుల సంకేతమే కలలకు తొలకరి
వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి
గుండెలో సంగీతమే కురిసినదెందుకో
కోయిల పాటే ఇలా పలికిన విందుకో
చెలువుగ ఎద మారే మధువనిగా
అమవస నిశి మారే వెన్నెలగా
అంజలి అంజలి ఇది హృదయాంజలి
నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి, నీ గాన మాధురికి గీతాంజలి
ఎద దోచు నవ్వులకు నటనాంజలి, కవి అయిన నీ మదికి కవితాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి, ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి

అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే
అంజలి నా ఊపిరై పలికెను పల్లవే
కన్నుల నువ్వు లేనిదే కలలే రావులే
నా మది నువ్వు లేనిదే కవితే లేదులే
తెలిసెను నువ్వే నా మనసువని
మోజుకు నెలవైన వలపువని
అంజలి అంజలి వలపుల నా చెలి
పూవంటి పదములకు పుష్పాంజలి, ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి, ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి

Credits
Writer(s): A R Rahman, Rajashri
Lyrics powered by www.musixmatch.com

Link