Okanaati Maata Kadhu

ఒకనాటి మాట కాదు ఒకనాడు తీరిపోదు
ఒకనాటి మాట కాదు ఒకనాడు తీరిపోదు
తొలినాటి ప్రేమ దీపం కలనైన ఆరిపోదు
తొలినాటి ప్రేమ దీపం కలనైన ఆరిపోదు
ఒకనాటి మాట కాదు ఒకనాడు తీరిపోదు

ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆటాడుకున్నాయో
ఎన్నడు నా చేతులు నీ చేతులతో మాటాడు కున్నాయో
ఆ ఆ ఆ ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆటాడుకున్నాయో
ఎన్నడు నా చేతులు నీ చేతులతో మాటాడు కున్నాయో
ఆ ఆ పొదలో ప్రతి పువ్వు పొంచి పొంచి చూసినది
గూటిలో ప్రతి గువ్వ గుస గుస లాడినది
కలసిన కౌగిలిలో కాలమే ఆగినది
ఒకనాటి మాట కాదు ఒకనాడు తీరిపోదు

చల్లగ చలచల్లగ చిరు జల్లుగ నీ గుండెల్లో కురిసేనా
మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ వూహల్లో విరిసేనా
ఆఆ హ చల్లగ చలచల్లగ చిరు జల్లుగ నీ గుండెల్లో కురిసేనా
మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ వూహల్లో విరిసేనా
ఆఆ. . కొంటెగా నిన్నేదో కోరాలని వుంది
తనువే నీదైతే దాచే దేముంది
వలపుల వీణియపై బ్రతుకే మ్రోగింది

ఒకనాటి మాట కాదు ఒకనాడు తీరిపోదు
తొలినాటి ప్రేమ దీపం కలనైన ఆరిపోదు
ఒకనాటి మాట కాదు ఒకనాడు తీరిపోదు



Credits
Writer(s): Mia Post, Ava Post
Lyrics powered by www.musixmatch.com

Link