Paala Rathi Mandirana

పాలరాతి మందిరాన పడతిబోమ్మ అందం
అనురాగ గీతిలోన అచ్చ తెలుగు అందం
పాలరాతి మందిరాన పడతిబోమ్మ అందం

రతనాల కోట ఉంది రాచకన్నె లేదు
రంగైన తోట ఉంది రామచిలుక లేదు
ఆ రాచ కన్నెవు నీవై అలరిస్తే అందం
నా రామచిలుకవు నీవై నవ్వితే అందం
పాలరాతి మందిరానా పడతిబోమ్మ అందం
అనురాగ గీతిలోన అచ్చ తెలుగు అందం
పాలరాతి మందిరానా పడతిబోమ్మ అందం

కన్నెమనసు ఏనాడూ సన్నజాజి తీగ
తోడు లేని మరునాడూ వాడి పోవు కాదా
ఆ తీగకు పందిరి నీవై అందుకుంటే అందం
ఆ కన్నెకు తోడుగ నిలిచి అల్లుకుంటే అందం
పాలరాతి మందిరాన పడతిబోమ్మ అందం
అనురాగ గీతిలోన అచ్చ తెలుగు అందం
పాలరాతి మందిరాన పడతిబోమ్మ అందం

నీ సోగకన్నుల పైనా బాస చేసినాను
నిండు మనసు కోవెలలోనా నిన్ను దాచినాను
ఇరువురిని ఏకం చేసే ఈ రాగబంధం ఎన్నెన్ని జన్మలకైనా చెరిగి పోని అందం
చెలుని వలపు నింపుకున్న చెలియ బ్రతుకు అందం
అనురాగ గీతిలోనా అచ్చ తెలుగు అందం
లాలలాల



Credits
Writer(s): Veda, Dr. C Narayana Reddy
Lyrics powered by www.musixmatch.com

Link