Oka Konte Pillane

ఒక కొంటె పిల్లనే చూసా
Centimeter నవ్వమని అడిగా
తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే

(అయ్యయ్యో
అయ్యయ్యో
అయ్యయ్యో)

ఒక కొంటె పిల్లనే చూసా
Centimeter నవ్వమని అడిగా
తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే

(అయ్యయ్యో
అయ్యయ్యో
అయ్యయ్యో)

బాపూ
బాపూ
బాపూ బాపూ

ఒక కుర్రవాడినే చూశా
నా వంక చూడమని అడిగా
తను చూసే చూపుకి పచ్చిగడ్డి భగ్గుమన్నదే

(హయ్యయ్యో
హయ్యయ్యో
హయ్యయ్యో)

పాపూ
పాపూ
పాపూ పాపూ

(హయ్యయ్యో హయ్యయ్యో
హయ్యయ్యో హయ్యయ్యో)

కన్నవారినే మరిచి నిన్ను మనసులో తలచా
పరిక్షలు రాసే బదులు ప్రేమలేఖ రాశా
స్నానపు గదిలో చిందు తలచి మదిలోన మురిశా
వలువలు విడిచి వచ్చి సబ్బు నురగనే తొడిగా
ఒక దోమ కుట్టినా ఓర్వనులే అది మెత్తని నావంటి నైజం
నను తేలు కుట్టినా జంకనులే అది ఏమాయనో బింకం
పాపూ, పాపూ
పాపూ, పాపూ
మెలకువలోన కలలను కన్నా నిద్దురలోన నిజమునుకన్నా
ఇది నీకు కలుగునే చెప్పవే భామా

(అయ్యయ్యో
అయ్యయ్యో
అయ్యయ్యో
అది ఏమైందో తెలియదులే
అది నువ్వైనా ఎరగదులే
ఒక మాటైనా పిలువదులే
ఇది తీపి చేదు కధలే

జామురాత్రి జాబిల్లి జగడమాడే నన గిల్లి
నీ తోడు కోరితే గాని నిప్పు కణములే జల్లే
శ్రావణ మాసపు జల్లు గుండెలోన గుచ్చే ముల్లు
ఎంగిలి మింగే వేళ గొంతులోన గోల
పర స్త్రీలను చూస్తే పడవాయె
కానే తనకు మాకు గొడవాయె
మగవారిని చూస్తే విసుగాయే
నా రేయికి వెలుతురు బరువాయె
బాపూ
బాపూ
బాపూ బాపూ
పిడుగే పడినా వినబడలేదు మదిలో అలజడి నిద్రపోలేదు
ఇది నీకు తప్పదు ఒప్పుకో మామా
(అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో)

ఒక కొంటె పిల్లనే చూసా
Centimeter నవ్వమని అడిగా
తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే

తను చూసే చూపుకి పచ్చిగడ్డి భగ్గుమన్నదే

తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే



Credits
Writer(s): Deva, A M Rathnam
Lyrics powered by www.musixmatch.com

Link