Pranaamam

ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
ప్రమోదం ప్రమోదం ప్రమోదం
ప్రతీ సృష్టి చిత్రం ప్రమోదం
ప్రయాణం ప్రయాణం ప్రయాణం
విశ్వంతో మమేకం ప్రయాణం
(థోమ్ ధిరననన ధిర ధిరన)
(థోమ్ ధిరననన ధిర ధిరన)
(థోమ్ ధిరన ధిరన ధీర ధీరనాన)

మన చిరునవ్వులే పూలు, నిట్టూర్పులే తడి మేఘాలు
హృదయమే గగనం, రుధిరమే సంద్రం, ఆశే పచ్చదనం
మారే ఋతువుల వర్ణం, మన మనసుల భావోద్వేగం
సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం
నువ్వెంత నేనెంత రవ్వంత, ఎన్నో ఏళ్లదీ సృష్టి చరిత
అనుభవమే దాచిందీ కొండంత, తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా
ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం

ఎవడికి సొంతమిదంతా, ఇది ఎవ్వడు నాటిన పంట
ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్టా
తరములనాటి కథంతా మన తదుపరి మిగలాలంట
కదపక చెరపక పదికాలాలిది కాపాడాలంట
ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం, ఇష్టంగా గుండెకు హత్తుకుందాం
కన్నెర్రై కన్నీరై ఓ కొంచెం తల్లడిల్లిందో ఈ తల్లి, ఏ ఒక్కరు మిగలం
ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
థోమ్ ధిరననన ధిర ధిరన)
(థోమ్ ధిరననన ధిర ధిరన)
(థోమ్ ధిరన ధిరన ధీర ధీరనాన)



Credits
Writer(s): Ramajogayya Sastry, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link