Aadiyu Anaadiyu Neeve

ఆది అనాదియు నీవే దేవా
నింగియు నేలయు నీవే కావా
ఆది అనాదియు నీవే దేవా

అంతట నీవే ఉండెదవు
అంతట నీవే ఉండెదవు
శాంతివై కాంతివై నిండెదవు
ఆది అనాదియు నీవే దేవా

నారద సన్నుత నారాయణా
నారద సన్నుత నారాయణా
నరుడవో సురుడవో
శివుడవో లేక శ్రీసతి పతివో
నారద సన్నుత నారాయణా

దానవ శోషణ మానవ పోషణ శ్రీచరణా భవ హరణా
దానవ శోషణ మానవ పోషణ శ్రీచరణా భవ హరణా
కనక చేల భయశమన శీల నిజ సుజనపాల హరి సనాతనా
క్షీర జలధిశయనా అరుణ కమలనయనా గాన మోహనా నారాయణా



Credits
Writer(s): Dasarathi, S Rajeshwara Rao
Lyrics powered by www.musixmatch.com

Link