Mana Oori Ramayanam (From "Mana Oori Ramayanam")

ఏవేవో ఏవేవో చూస్తూనే ఉంటాం
మనలోని లోపం తప్ప
ఏమేమో ఏమేమో మాటాడుతుంటాం
పనికొచ్చే విషయం తప్ప
(భలే చెప్పావ్)
చెవులారా
(వినుకోండి)
మనసారా
(చెబుతా)
మన ఊరి రామాయణం
ఇది మనలోని రామాయణం
మన ఊరి రామాయణం
ఇది మనలోని రామాయణం
పైకేమో శ్రీరామ చంద్రుడులా ఉంటాం
(ఎనలేని దయ చూపుతాం)
అవకాశం దొరికిందో అవతారం మార్చి
(రావణుడై చెలరేగుతాం)
సహనంలో శాంతంలో కరుణించడంలో
(కనిపిస్తాం సీతమ్మలా)
సాదింపులు వేదింపులు బెదిరింపులలోన
(సరిపోతాం సూర్పణకలా)
లోనొక్కటి బయటొక్కటి తైతక్కల వేషం
ఈ తప్పులు ఈ తిప్పలు
మన పొట్టలకోసం
ఉసురే కసిరే వరకూ
తెగదీ జంఝాటం

మన ఊరి రామాయణం
ఇది మనలోని రామాయణం
మన శక్తిని మనకెవ్వరో చెప్పేంతదాకా
(కూర్చుంటాం హనుమంతుడిలా)
మసిపూసే మందరల మాటలకే బాగా
(ఊ కొడతాం కైకేయిలా)
ఆ కుంభకర్ణుడిలా నిదురోతు ఉంటాం
(మన చుట్టూ ఏమైనాకాని)
మధమెక్కిన మైకంలో తెగవాలిపోతాం
(వావీ వరసలు అన్నీ మాని)
మొరపెట్టిన తిరిగొచ్చిన పరిగెట్టిన కాలం
పగపట్టద పనిపట్టద పడగెత్తిన లోకం
మనలో చెడుపై మనమే చేద్దాం పోరాటం

మన ఊరి రామాయణం
ఇది మనలోని రామాయణం

ఏమేమో ఏమేమో మాటాడుతుంటాం
పనికొచ్చే విషయం తప్ప
చెవులారా
(వినుకోండి)
మనసారా
(చెబుతా)
మన ఊరి రామాయణం
ఇది మనలోని రామాయణం
మన ఊరి రామాయణం
ఇది మనలోని రామాయణం



Credits
Writer(s): Bhaskara Bhatla, Ilaiyaraaja
Lyrics powered by www.musixmatch.com

Link