Baba

బాబా
నువ్వు నవ్వేటి నడిచేటి ప్రేమించేటి తీరు
ఏ వేదాలు శాస్త్రాలు వర్ణించ లేవు
నీ దివ్య రూపం సర్వమంగళ స్వరూపం

బాబా నువ్ కూర్చున్న తీరు
చూస్తుంటే మా ముచ్చట తీరు

బాబా నువ్ కూర్చున్న తీరు
చూస్తుంటే మా ముచ్చట తీరు
యోగసుమం పూసినట్టు
జ్ఞానవనం విరిసినట్టు
ధ్యానఫలం పండినట్టు
కుండలి మేల్కొనట్టు

బాబా నీ లీలలే వేరు
నువ్ ప్రేమ రూపమైన ఫకీరు
బాబా
బాబా నీ లీలలే వేరు
నువ్ ప్రేమ రూపమైన ఫకీరు

బాబా నువ్వు నవ్వేటి తీరు
ఏ చిత్రకారులురు గియ్యలేరు
చంద్రవంక మెరిసినట్టు
సిరివెన్నెల కురిసినట్టు
గురుపౌర్ణమి విరిసినట్టు
అద్వైతం నవ్వినట్టు

బాబా నీ మహిమలే వేరు
నువ్వు కరుణరూపమైన ఫకీరు

బాబా నువ్వు నడిచేటి తీరు
ఏ కవులు వారించలేరు
గురుపీఠం కదిలినట్టు
తపోగాలి వీచినట్టు
లెండివనం ఊగినట్టు
యోగవృష్టి కురిసినట్టు

బాబా నీ మాయలే వేరు
నువ్వు పారె ఆధ్యాత్మిక సెల ఏరు

బాబా నువ్వు మోముకడుగు తీరు
ఏ యోగులు వివరించలేరు
బోధి చెట్టు వంగినట్టు
పూల ఝల్లు రాలినట్టు
మబ్బుచాటు చందమామ యోగనిద్ర లేచినట్టు

బాబా నీ ప్రతి చర్య యోగం
నిను కనులారా చూచుటే భాగ్యం

బాబా నువ్ ప్రీమించు తీరు
ఏ దేవుళ్ళు వర్ణించలేరు
ఇంద్రధనస్సు వంగినట్టు
నింగి పొంగి పొరలినట్టు
సప్త సాగరాలన్ని గుండెల్లో ఎగేసినట్టు

బాబా నీ దినాచరి ఒక యజ్ఞం
నిను సేవించు వారిదే స్వర్గం
నిను సేవించు వారిదే స్వర్గం



Credits
Writer(s): Poloor Ghatikachalam, Bikki Krishna
Lyrics powered by www.musixmatch.com

Link