Paluku Tenela - Abheri - Kanda Chapu

పలుకు తేనెల తల్లి పవళించెను
పలుకు తేనెల తల్లి పవళించెను
పలుకు తేనెల తల్లి పవళించెను
కలికి తనముల విభుని గలసినది గాన
పలుకు తేనెల తల్లి పవళించెను
కలికి తనముల విభుని గలసినది గాన
పలుకు తేనెల తల్లి పవళించెను

నిగనిగని మోముపై నెరులు గెలకుల జెదర
పగలైన దాక చెలి పవళించెను
నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర
పగలైన దాక చెలి పవళించెను
తెగని పరిణతులతో తెల్లవారినదాక
జగదేక పతి మనసు
జగదేక పతి మనసు జట్టి గొనె గాన
తెగని పరిణతులతో తెల్లవారినదాక
జగదేక పతి మనసు జట్టి గొనె గాన
పలుకు తేనెల తల్లి పవళించెను
కలికి తనముల విభుని గలసినది గాన
పలుకు తేనెల తల్లి పవళించెను

కొంగు జారిన మెరుగు గుబ్బ లొలయగ తరుణి
బంగారు మేడపై పవళించెను
కొంగు జారిన మెరుగు గుబ్బ లొలయగ తరుణి
బంగారు మేడపై పవళించెను
చెంగలువ కనుగొనల సింగారములు ఒలక
అంగజ గురునితోడ అలసినదిగాన
చెంగలువ కనుగొనల సింగారములు ఒలక
అంగజ గురునితోడ అలసినదిగాన
పలుకు తేనెల తల్లి పవళించెను
కలికి తనముల విభుని గలసినది గాన
పలుకు తేనెల తల్లి పవళించెను

మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై
పరవశంబున తరుణి పవళించెను
మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై
పరవశంబున తరుణి పవళించెను
తిరు వేంకటాచలధిపుని కౌగిట గలసి
తిరు వేంకటాచలధిపుని కౌగిట గలసి
అరవిరై నును చెమట అంటినదిగాన
తిరు వేంకటాచలధిపుని కౌగిట గలసి
అరవిరై నును చెమట అంటినదిగాన
పలుకు తేనెల తల్లి పవళించెను
కలికి తనముల విభుని గలసినది గాన
పలుకు తేనెల తల్లి పవళించెను
పలుకు తేనెల తల్లి పవళించెను
పవళించెను
పవళించెను
పవళించెను



Credits
Writer(s): Annamacharya
Lyrics powered by www.musixmatch.com

Link