Padalenu

పాడలేను పల్లవైన భాష రాని దానను
వేయలేను తాళమైన లయ నేనెరుగను
పాడలేను పల్లవైన భాష రాని దానను
వేయలేను తాళమైన లయ నేనెరుగను
పాడలేను పల్లవైన భాష రాని దానను
వేయలేను తాళమైన లయ నేనెరుగను
తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా
తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా
పాడలేను పల్లవైన భాష రాని దానను
వేయలేను తాళమైన లయ నేనెరుగను

అమ్మ జోల పాటలోన రాగమెంతో ఉన్నది
పంటచేల పాటలోన భాష ఎంతో ఉన్నది
ఓయలే తాళం పైర గాలే మేళం
మమతే రాగం శ్రమ జీవనమే భావం
రాగమే లొకమంతా ఆ ఆఆ
రాగమే లొకమంతా కష్ట సుఖములే స్వరములంట
షడ్జమ కోకిల గాన స్రవంతికి పొద్దు పొడుపే సంగతంట
పాడలేను పల్లవైన భాష రాని దానను
వేయలేను తాళమైన లయ నేనెరుగను

రాగానిదేముంది రసికులు మన్నిస్తె
తెలిసిన భాషలోనే తీయగా వినిపిస్తె
ఏ పాటైన ఎద పొంగిపోదా
ఏ ప్రాణమైనా తామిదీరి పొదా
చెప్పేది తప్పొ ఒప్పొ ఊ ఊఊ
చెప్పేది తప్పొ ఒప్పొ రహస్యమేముంది విప్పి చెపితె
ఆహు ఊహు రొకటి పాటలో లేదా మధుర సంగీతం
ఆహు ఊహు రొకటి పాటలో లేదా మధుర సంగీతం

పాడలేను పల్లవైన భాష రాని దానను
వేయలేను తాళమైన లయ నేనెరుగను
తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా
తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా

పాడలేను పల్లవైన భాష రాని దానను
వేయలేను తాళమైన లయ నేనెరుగను
మపదమ పాడలేను పల్లవైన
సా రీ గ మపదమ పాడలేను పల్లవైన
పద నిస నీదమగసరి పాడలేను పల్లవైన

ససరిగ సరిగమగస పదమ
మమపద మపదనిదమ పదని
పదనిస రిగసని దమపదనిస ని
ద పదనిద మపదమ గమపద మగమగస

సాసస సాసస సాసాసస సరిగమగమగసనిద
మామమ మామమ మామమ పదనిసనిదమగ
సాస రీరీ గాగా మామా పాపా దాదా నీనిస
రిగసస నిసనినిద మపదని దనిదదమ
గమగస రిగమగ మపదమ పదనిసరి గపదని సనిదమగ

మరి మరి నిన్నే మొరలిడ నీ మనసున దయరాదూ
మరి మరి నిన్నే మొరలిడ నీ మనసున దయరాదూ



Credits
Writer(s): Ilayaraja, G Satyamurthy
Lyrics powered by www.musixmatch.com

Link