Sumagandhaala (From "Kerintha")

తలచినచో జరుగునని
కల నిజమై దొరకునని
అరెరెరెరెరె అనుకోలేదు ఎపుడు
అరెరెరెరెరె ఎదురుగా నిలిచెను చెలి తోడు
అరెరెరెరెరె అరుదుగ కలవరం ఇపుడు
ఘుమ ఘుమ స్వరముగా పలికేనే నాలో నేడు

సుమగంధాల తేలింది గాలంతా
వాన విల్లల్లే మారింది నెలంతా
మౌన రాగాలు పాడింది మనసంతా
నిజముగా నిజమని నమ్మనా నేనీ వింత

సుమగంధాల తేలింది గాలంతా
వాన విల్లల్లే మారింది నెలంతా
మౌన రాగాలు పాడింది మనసంతా
నిజముగా నిజమని నమ్మనా నేనీ వింత

రమ్మని అనలేదు రాలేదనుకోలేదు
మనసులో ఇష్టంగా ఉన్ననలా
కలత పాడనేలేదు కంగారైపోలేదు
ప్రేమగ ప్రేమించా లోలోపల
ఓర్పుగా వేచిన చోటే తూర్పుగ ఉదయిస్తోంది
మార్పు జరిగేలా ఈ లోకం అంత నాకు సాయపడుతోంది

సుమగంధాల తేలింది గాలంతా
వాన విల్లల్లే మారింది నెలంతా
మౌన రాగాలు పాడింది మనసంతా
నిజముగా నిజమని నమ్మనా నేనీ వింత

ఆవిరి అయిపోయాయి ఇన్నాళ్ల దూరాలు
మాయం అయిపోయాయి సందేహాలు
చెరువవుతున్నాయి సంతోష తీరాలు
చెలియాతో నేనుంటే అంతే చాలు
కారణం ఏమైతేనేం కాలమే కలిసొచ్చింది
ప్రేమ నన్ను నమ్మి నా పెదవిపైన తోరణాలు కడుతోంది

సుమగంధాల తేలింది గాలంతా
వాన విల్లల్లే మారింది నెలంతా
మౌన రాగాలు పాడింది మనసంతా
నిజముగా నిజమని నమ్మనా నేనీ వింత

సుమగంధాల తేలింది గాలంతా
(సుమగంధాల తేలింది గాలంతా)
వాన విల్లల్లే మారింది నెలంతా
(వాన విల్లల్లే మారింది నెలంతా)
మౌన రాగాలు పాడింది మనసంతా
నిజముగా నిజమని నమ్మనా నేనీ ఈ వింత



Credits
Writer(s): Ramajogayya Sastry, Mickey J Meyer
Lyrics powered by www.musixmatch.com

Link