Chalunaya

చాలునయా నీ వరసే
ఏ సడిలేని ఈ సమయం
నీ నవ్వే మెల్లగా నన్నే గిల్లగా ఝల్లుమంది నా హృదయం
కళ్ళు వెతుకు ప్రతినిమిషం కొంటె సఖుని జాడ
దొరకదుగా నా మనసే నాకు కూడా
చాలునయా నీ వరసే
ఏ సడిలేని ఈ సమయం
నీ నవ్వే మెల్లగా నన్నే గిల్లగా ఝల్లుమంది నా హృదయం

స్వరమే ఒక జగమై జంట కడదాం అది మనమై
కలలే ఒక మేడై అంటి ఉందాం మనం నిజమై
ఓ మనదే ఈ ఏకాంతవేళ నీ ఒడే చేరు వేళ
పెదవులే ఇరు తలుపులుగా ఎదలోనికి నడిచినది
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
చాలునయా నీ వరసే
చాలునయా నీ వరసే
ఏ సడిలేని ఈ సమయం నీ
హో నవ్వే మెల్లగా నన్నే గిల్లగా ఝల్లుమంది నా హృదయం
హో కళ్ళు వెతుకు ప్రతినిమిషం కొంటె సఖుని జాడ
దొరకదుగా నా మనసే నాకు కూడా
చాలునయా నీ వరసే

సాటిరాదు ఏ భాషైనా ఏకమైతే చూపులే
గువ్వలుగా మారనివ్వు మనలోని ఊహలే
శిల్పం లాగా మార్చి నన్నే రేబవలు సేవించావే
నేడు మళ్ళీ శిలగా మార్చే వింత పనే దేనికో
హోయ్ చాలునయా నీ వరసే
ఏ సడిలేని ఈ సమయం
నీ నవ్వే మెల్లగా నన్నే గిల్లగా ఘల్లుమంది నా హృదయం
హో కళ్ళు వెతుకు ప్రతినిమిషం కొంటె సఖుని జాడ
దొరకదుగా నా మనసే నాకు కూడా



Credits
Writer(s): A.r. Rahman, Vanamali
Lyrics powered by www.musixmatch.com

Link