Pillo Pisinari Pillo (From "Itlu Sravani Subramanyam")

అతను: పిల్లో పిసినారి పిల్లో ఓ ముద్దియ్యరాదే పిల్లా ||పిల్లో||
అతను: ఓసారి నువ్వే వళ్ళోకి వస్తే తేరుగేమి అవుతా ఔతాదే నీతాతా ముల్లె
ఆమె: బావో అయ్యెబావో ఓ బావో బద్మాషుబావో
నీ ఏషాలు నాకాడగానో ||బావో||
సందిస్తె వస్తావు నా ఎంట పడతావు సందేళ సీమల్లే కుట్టెసిపోతావు
అతను: పిల్లో ఓపిల్లో
ఆమె: బావో బావా
అతను: పున్నాల ఎన్నెలలోన తానాలు ఆడేటి యేల
ఆ సున్ని పిండల్లే జాణా నీ ఒళ్ళు నేనంటుకోనా
ఆమె: జల్లల్లె సల్లంగ మొన్న రొయ్యల్లె సెయ్యెటి నిన్న
గిల్లితె నాబుగ్గ పైన అల్లాడిపోతిని కానా
అతను: రాగాల నావ నువ్వయితే నీకు రంగేళి తెరసాప కానా
ఆమె: రాకయ్యో మీద పడకయ్యో కోరమీసాల సొరసేపలాగా
అతను: వయ్యరి కడవా ఓ పూల పడవా వలయేస్తే పరిగల్లె నా ఒళ్ళో పడవా
ఆమె: పిల్లో పిసినారి పిల్లో ఓ ముద్దుయ్యరాదే పిల్లా
అతను: హైలెస్సా కెరటాల మీన తెలతెల్ల నురుగల్లెరానా
లేలేత కలువాలు అయినా నీ పాదాలు ముద్దాడుకోనా
ఆమె: ముద్దాస ఎరవేస్తు వున్నా బుద్దింక ఎరగానిదైనా
సిన్నారి సిరపక్కెనేనా నీ గాలంకి నేచిక్కుతానా
అతను: ఎందుకే కన్నుగీటితే బెదురు పీతల్లే దూరేవు కలుగూ
ఆమె: ఒంటిగా సేత సిక్కితే పైడి ఒంటికి పెడతావు నలుగూ
అతను: నువ్వొప్పుకున్నా తప్పించుకున్నా నీ కొప్పుపూనేను కొరమీనకూన
అతను: బావో అయ్యే బావో ఓ సింగారిబావో నీమనసే బంగారంలేవో
హెయ్ బావో సింగారి బావో నీ మనసే బంగారం లేవో
బావొ సింగారి బావో నీ మనసే బంగారం లేవో
ఓ తాళి కడితే నీ దాన్ని అవుత మనువాడి నీకే ముద్దిచ్చుకుంటా
అతను: పిల్లో
ఆమె: ఓ
అతను: పిల్లో
ఆమె: ఎయ్ బావో బావా
ఆమె: బావ
అతను: ఆహ
ఆమె: బావోయ్
అతను ఓహొ
ఆమె: బావో బావ

ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి



Credits
Writer(s): Sahithi, Chakri
Lyrics powered by www.musixmatch.com

Link