Enno Tyagala Dhasyama

మేము భారత దేశానికి
విధేయుడుగా ఉంటానని
ఈ రాష్ట్ర పోలీసు సంస్థలో
నిస్పక్షపాతంగా నిర్భయంగా
రాగ ద్వేషాలకు అతీతంగా
ప్రజలకు సేవ చేస్తానని
ప్రజల హక్కులను గౌరవిస్తూ
నాకప్పగించిన విధులను
చట్ట సమేతంగా నిర్వహిస్తానని
భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

ఎన్నో త్యాగాల దాస్యమా
ఏం సాధించింది నీ శ్రమ
ఎన్నో త్యాగాల దాస్యమా
ఏం సాధించింది నీ శ్రమ
ఈ నిజం మోసమా
ఈ నిజం మోసమా
కలలు కన్నావు నా దేశమా
రాలిన స్వప్నాల సాక్షిగా
పాపమే పాలించే స్వేచ్ఛగా
ఎన్నో త్యాగాల దాస్యమా
ఏం సాధించింది నీ శ్రమ

ఎన్నాళ్లైనా చలనమే లేని
రాతి రధంపై ప్రయాణమా
కావాలన్నా కాంతే రాని
కారడవే నీకు గమ్యమా
అర్ధరాత్రి వేళలో
అర్ధరాత్రి వేళలో
అలికిడే స్వతంత్రమా
నిద్ర చెడిన కళ్ళలో
ఎర్రదనమే ఉదయమా
(రాలిన స్వప్నాల సాక్షిగా)
(పాపమే పాలించే స్వేచ్ఛగా)
ఎన్నో త్యాగాల దాస్యమా
ఏం సాధించింది నీ శ్రమ
నేను భారత దేశానికి
విధేయుడుగా ఉంటానని
ఈ రాష్ట్ర పోలీసు సంస్థలో
నిస్పక్షపాతంగా నిర్భయంగా
రాగ ద్వేషాలకు అతీతంగా
ప్రజలకు సేవ చేస్తానని
ప్రజల హక్కులను గౌరవిస్తూ
నాకప్పగించిన విధులను
చట్ట సమేతంగా నిర్వహిస్తానని
భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

కాసే కంచే మేస్తూవుంటే
చేనుకు ఏదింక రక్షణ
వేకువతోనే చీకటి పడితే
పయనం అడుగై సాగునా
భానిసత్వ భావన
మసులోనే మిగిలినా
శాంతి జాడ దొరకునా
ఎంత సేపు వెతికినా
రాలిన స్వప్నాల సాక్షిగా
పాపమే పాలించే స్వేచ్ఛగా
ఎన్నో త్యాగాల దాస్యమా
ఏం సాధించింది నీ శ్రమ
ఈ నిజం మోసమా
ఈ నిజం మోసమా
కలలు కన్నావు నా దేశమా
రాలిన స్వప్నాల సాక్షిగా
పాపమే పాలించే స్వేచ్ఛగా



Credits
Writer(s): Seetarama Shastri, Ilaiyaraja, Kona Venkat
Lyrics powered by www.musixmatch.com

Link