Banthi Laanti Banthayi

బంతిలాంటి బత్తాయి వారెవా
బన్నులాంటి అమ్మాయి వారెవా
దోరగుంది బొప్పాయ వారెవా
దొంగ ముద్దు ఇమ్మంది వారెవా
చేత పట్టుకున్న చేయ్యి చేసుకున్న
చెంగు చెంగు మంటుంటే హయ్ హయ్
కోసి తీసుకున్న juice చేసుకున్న
మోజు మీద జుర్రుకుంటే లోలోలోలాయి

బంతిలాంటి బత్తాయి వారెవా
బన్నులాంటి అమ్మాయి వారెవా
దోరగుంది బొప్పాయ వారెవా
దొంగ ముద్దు ఇమ్మంది వారెవా
కులుకేటి పరువాలు కుశలాలు అడిగాయి
నీ కౌగిలంతా ఘాటు కోరి వచ్చానోయీ
అల్లరి ప్రేమికుడు
అదిరేటి అధరాలు కధలేవో తెలిపాయి
తొలి ముద్దు తేనె సంతకాలు అడిగే వేళా
మొదలైంది రగడ
జగదగిరి జాతరలో
జమక్కు జమ చూడాలి
మొగలి సిరి పాతరలో
మొదటి ముడి వీడాలి
గుమ్మలూరి పిల్ల సమ్మలూరి కిల్ల
చెంపలార పెట్టుకుంటే హాయ్ హాయ్
నిమ్మ చెక్క తింటూ చెమ్మ చెక్కాలంటూ
తిమ్మిరెక్కుతున్న వేళా లోలోలోలాయి

బంతి లాంటి బత్తాయి వారెవా
బన్ను లాంటి అమ్మాయి వారెవా
దోరగుంది బొప్పాయి వారెవా
దొంగ ముద్దులిమ్మంది వారెవా
Whistle ఏసి నా ఈడు గజలేదో పాడింది
ఏ తప్పెటయినా మద్యలైన తబలాలైన
చూడని beet ఉంది
గజ నిమ్మ పండంటి నజరానా నీదంది
నా గజ్జ గళ్లు మన్న వేళ
ఒళ్లు ఒళ్లు తడిమే ఆటుంది
సిగతరగ ఏం వయసు
సెగల చలి రేపింది
సొగసరగా నీ దురుసు
పగటి గిలి చూపింది
హా తాళమేసుకుంటూ తాయిలాలు తింటూ
తాపమంతా తీర్చుకుంటా హాయ్ హాయ్
Heart beet వింటూ హుంగ్ చేసుకుంటూ
హాజరైన మోజులోన లోలోలోలాయి

బంతి లాంటి బత్తాయి వారెవా
బన్ను లాంటి అమ్మాయి వారెవా
దోరగుంది బొప్పాయి వారెవా
దొంగ ముద్దులిమ్మంది వారెవా
వారెవా



Credits
Writer(s): M. M. Keeravani, Vennelakanti Subbu Rajeswara Prasad
Lyrics powered by www.musixmatch.com

Link