Naa Mansuna

నా మనసున విరబూసిన ఓ చెలియా
నీ సొగసున వెల్లువైయున్న పరిమళమా
నీ చెక్కిలిపై చినుకై తడపనా
నీ సరసకు నేనే వచ్చి వాలనా
సరదాగ సంతోషంగా నే కురవనా
నీలాల నీ కన్నుల్లో నే తడవనా
సరదాగ సంతోషంగా నే కురవనా
నీలాల నీ కన్నుల్లో నే తడవనా

నీ మనసులో విరబూసిన నీ చెలిని
నా అడుగున నిండి పోయిన జాబిలివే
ఏ జన్మకైనా వీడని బంధమే
ఏ రేయైనా వెన్నెల రేయినే
సరాసరాగాల నీకేనని
ప్రేమానురాగాలు నే పొందని
సరాసరాగాల నీకేనని
ప్రేమానురాగాలు నే పొందని
మనసు దోచింది నీవే
నా కలలకు రూపం నీవే
ఆశ రేపింది నీవే
ఆ బాస చేసింది నీవే
రేయైనా పగలైనా
రేయైనా పగలైనా నీ ధ్యానమే
మనసైనా తనువైనా
మనసైనా తనువైనా
నీ నీడను అవుతాను నే
నీ మనసులో విరబూసిన నీ చెలిని
నా అడుగున నిండి పోయిన జాబిలివే
ఆ నీ నవ్వు నేర్పింది నాలో
సరికొత్త భావాన్ని నేడే
నీ చూపు తడిమింది నన్నే
నా సొగసు పిలిచింది నిన్నే
బ్రతుకైనా బంధమైనా
బ్రతుకైనా బంధమైనా నీ తోడుగా
నా మదిలో నిను నిలిపి
నా మదిలో నిను నిలిపి
పూజించనా కలకాలము

నా మనసున విరబూసిన ఓ చెలియా
నీ సొగసున వెల్లువైయున్న పరిమళమా
ఏ జన్మకైనా వీడని బంధమే
ఏ రేయైనా వెన్నెల రేయిలే
సరదాగ సంతోషంగా నే కురవనా
నీలాల నీ కన్నుల్లో నే తడవనా
సరదాగ సంతోషంగా నే కురవనా
నీలాల నీ కన్నుల్లో నే తడవనా



Credits
Writer(s): Praveen, Pranavi
Lyrics powered by www.musixmatch.com

Link