Yemayindo Yetu (Female Version)

ఏమైందో ఎటు వెళ్ళిందో
నిను చూసిన నా హృదయం
నీతోనే తను చేరిందో
కావాలని నీ స్నేహం
రావా రాలేవా నే బతికే
ఈ ప్రతి నిముషం నీకోసం
రావా రాలేవా నే బ్రతికే
ఈ ప్రతి నిముషం నీకోసం

ఏమైందో ఎటు వెళ్ళిందో
నిను చూసిన నా హృదయం
నీతోనే తను చేరిందో
కావాలని నీ స్నేహం

ఎందరు ఉన్నా అందరిలోనూ
కనిపించేది నీ రూపే
ఎవరేమన్నా ఏమంటున్నా వినిపించేది
నీ మాటే
కనుపాపలలో కమ్మని కలగా
కదలాడేది నీ తలపే
నేనేమౌతున్నా నీకోసమనే నిలుచున్నది
నా శ్వాస
ఏనాడైనా నిను దరి చేరేనని
బ్రతికేస్తున్నది ఆశ
రావా రా లేవా నే బతికే
ఈ ప్రతి నిమిషం నీ కోసం

ఏమైందో ఎటు వెళ్ళిందో
నిను చూసిన నా హృదయం

నవ్వే ఎరుగని పెదవుల పైన
చిరునగవై నీవొచ్చావే
ప్రేమే తెలియని నా మనసునకు
ప్రేమను ప్రేమగా పంచావే
నీ పరిచయమే జరగకపోతే
జీవితమంతా వృదయేగా
నిను చూసిన క్షణమే
నీలో సగమై
నా నీడను నే మరిచా
నీ ఊహలతో నా మనసును నింపి
నీకోసమే నే వేచా
రావా రా లేవా నే బతికే
ఈ ప్రతి నిమిషం నీ కోసం

ఏమైందో ఎటు వెళ్ళిందో
నిను చూసిన నా హృదయం
నీతోనే తను చేరిందో
కావాలని నీ స్నేహం
రావా రాలేవా నే బతికే
ఈ ప్రతి నిముషం నీకోసం



Credits
Writer(s): Vidya Sagar, Vennalakanti
Lyrics powered by www.musixmatch.com

Link