Prema O Prema

ప్రేమా ఓ ప్రేమా వచ్చావా ప్రేమా
అనుకుంటూనే ఉన్నా రామ్మా
ప్రేమా ఓ ప్రేమా తెచ్చావా ప్రేమా
కాదంటానా అయ్యో రామా
గుమ్మందాకా వచ్చి ఇప్పుడాలోచిస్తావేమ్మా

గుండెల్లో కొలువుంచి నిన్నారాధిస్తాలేమ్మా
ఇకపై నువ్వే నా చిరునామా

ప్రేమా ఓ ప్రేమా వచ్చావా ప్రేమా
అనుకుంటూనే ఉన్నా రామ్మా
ప్రేమా ఓ ప్రేమా తెచ్చావా ప్రేమా
కాదంటానా అయ్యో రామా

హృదయములో మృదులయలో కదిలిన అలికిడి తెలియనిదా
నిద్దురలో మెలకువలో అది నన్ను నిమిషం విడిచినదా
ఎక్కడుంది ఇంతకాలం, జాడలేని ఇంద్రజాలం
సరస సరాగ సురాగమదేదో నరనరములా స్వరలహరులై
ప్రవహించిన ప్రియ మధురిమ

ప్రేమా ఓ ప్రేమా వచ్చావా ప్రేమా
అనుకుంటూనే ఉన్నా రామ్మా
ప్రేమా ఓ ప్రేమా తెచ్చావా ప్రేమా
కాదంటానా అయ్యో రామా

అడుగడుగూ తడబడగా తరిమిన అలజడి నువ్వు కాదా
అణువణువూ తడిసేలా తడిమిన తొలకరి నువ్వు కాదా
స్వాతిస్నేహం ఆలపించీ, చక్రవాకం ఆలకించి
మధన శరాలే ముత్యాల సరాలై
తొలి వానగా చలి వీణగా చెలి నీలగా ఎద వాలెగ

ప్రేమా ఓ ప్రేమా వచ్చావా ప్రేమా
అనుకుంటూనే ఉన్నా రామ్మా
ప్రేమా ఓ ప్రేమా తెచ్చావా ప్రేమా
కాదంటానా అయ్యో రామా
గుమ్మందాకా వచ్చి ఇప్పుడాలోచిస్తావేమ్మా

గుండెల్లో కొలువుంచి నిన్నారాధిస్తాలేమ్మా
ఇకపై నువ్వే నా చిరునామా



Credits
Writer(s): Chembolu Seetharama Sastry, S V Krisna Reddy
Lyrics powered by www.musixmatch.com

Link