Nalona Shivudu Galadu

నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు, నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు
నాలోన గల శివుడు, నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు
కోరితే శోకమ్ముబాపగలడు
నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు

నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు, నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు
నాలోన గల శివుడు, నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు
పాపులను తుంగలో తొక్కగలడు
నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు

నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, కొండపై ఉండగలడు
నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, కొండపై ఉండగలడు
వరమిచ్చి గుండెలో పండగలడు
నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు

నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు, నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు
నాలోన గల శివుడు, నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు
వద్దంటే రెంటినీ మూయగలడు
నా లోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు
నా లోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు

నా లోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు, నీలోన గల శివుడు సగము పంచియ్యగలడు
నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, సగము పంచియ్యగలడు
తిక్కతో అసలు తుంచేయగలడు
నా లోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు
నా లోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు

నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు, నీలోన గల శివుడు మనలోన కలవగలడు
నాలోన గల శివుడు, నీలోన గల శివుడు మనలోన కలవగలడు
దయతోటి తనలోన కలపగలడు
నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు

నాలోన శివుడు గలడు
నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు, నీలోన గల శివుడు నాటకాలాడగలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు
తెర దించి మూట కట్టెయ్యగలడు
నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టెయ్యగలడు
నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టెయ్యగలడు
నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టెయ్యగలడు
నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టెయ్యగలడు



Credits
Writer(s): Parthasarathy, Tanikella Bharani
Lyrics powered by www.musixmatch.com

Link