Nee Kosam Naa Gaanam (Pathos)

నీ కోసం నీ కోసం
నా గానం నా ప్రాణం నీ కోసం
నీ కోసం నీ కోసం నా గానం నా ప్రాణం నీ కోసం

నీ కన్నుల వెలుగులో నీలి నీడలెందుకో
నీ కన్నుల వెలుగులో నీలి నీడేందుకో
నీ వెన్నెల మోములో ఈ విషాదమెందుకో
నీ బాధను పంచుకొనగ నేనుంటిని కాదా
నేనుంటిని కాదా
నీ కోసం నీ కోసం నా గానం నా ప్రాణం నీ కోసం

నీ వేదనలోనే నా వేదన లేదా
నీ వేదనలోనే నా వేదన లేదా
నీ సన్నిధిలోనే నా పెన్నిధి లేదా
నీ చిరునవ్వుల లోనే జీవింతును గాదా
జీవింతును గాదా
నీ కోసం నీ కోసం నా గానం నా ప్రాణం నీ కోసం

నింగి నిదురపోయే నేల నిదురపోయే
నింగి నిదురపోయే నేల నిదురపోయే
గాలి నిదురపోయే లోకాలే నిదుర పోయే
నా హృదయమే నీ పానుపుగా నిదురించగ లేవా
నిదురించగ రావా
నీ కోసం నీ కోసం నా గానం నా ప్రాణం నీ కోసం
నా గానం నా ప్రాణం నీ కోసం



Credits
Writer(s): Reddy Dr C Narayana, T.chalapathy Rao
Lyrics powered by www.musixmatch.com

Link