Rangaa Rangaa Singaa Ranga

రంగా రంగా శింగారంగా రారా సారంగా
శృంగారంగా చిందేయంగా రావే సరసంగా
భారంగా వంగే సొంపులు కోరంగా
వచ్చే సాయంగా
తీయంగా అల్లి తీర్చన నీ బెంగ
రంగా రంగా శింగారంగా రారా సారంగా
శృంగారంగా చిందేయంగా రావే సరసంగా
విరిసే వయసా నీ చిక్కని సొంపుల
చక్కదనానికి చిక్కనివాడొక మనిషా
పిలిచే వరసా నులి వెచ్చని ముచ్చట
తెరిచిన కౌగిట నలగని నాదొక సొగసా
నవనవమను నీ పరువం
కువ కువమని కూసిన తరుణం
పిట పిట మను పడుచుదనం
పద పదమను ఈ నిముషం
అదిరే అందాల పెదవే కందాలి
ముదిరే ముద్దాటలో

రంగా రంగా శింగారంగా రారా సారంగా
శృంగారంగా చిందేయంగా రావే సరసంగా
కసిగా కసిరే చెలి కమ్మని తిమ్మిరి
ఘమ్ముగ తీర్చగ కమ్ముకు రావేం పురుష
సుఖమే అడిగే సఖి ముచ్చట తీరగ
వెచ్చని వేడుక పంచుటకే కద కలిశా
తహతహ మను దాహంతో
తపనలు పడు సంపదలివిగో
అలుపెరుగని మొహంతో
కలపడు మగతనమిదిగో
నడుమే నవ్వేల తడిమే నీ చేతి
చలువే చూపించుకో

రంగా రంగా శింగారంగా రారా సారంగా
శృంగారంగా చిందేయంగా రావే సరసంగా
భారంగా వంగే సొంపులు కోరంగా
వచ్చే సాయంగా
తీయంగా అల్లి తీర్చన నీ బెంగ



Credits
Writer(s): Koti, Seetarama Shastri
Lyrics powered by www.musixmatch.com

Link