Chitapata Chinuku La

చిటపట చినుకుల తాళం
చిగురాకులలో హిందోళం
కిలకిల చిలకల మేళం
నను పిలిచిన తొలి భూపాలం
గలగల గాజుల గానం
నా మనసుకు నేర్పెను తానం
జలజల వాగుల రాగం
నా వయసుకు నేర్పెను వేగం
ప్రతి కదలిక సంగీతం నేర్పుతున్నదీ
సరిగమలతొ సావాసం చేయమన్నదీ
నీ మాటలే నా పాటలై
కచేరి చేయాలి కాలం

East west north south అన్నిచేరితే
డోరెమీకి సాపసాకి తేడాలేదు భాయ్
జావళీకి జాస beat-u జంట కలిపై
జోరా జోరి swing-u మీద జాలి జాలి హోయ్

చిటపట చినుకుల తాళం
చిగురాకులలో హిందోళం
గలగల గాజుల గానం
నా మనసుకు నేర్పెను తానం

Kitchenలోని cooker ఈల వింటే
Dining table keyboard అవదా
వేడి వేడి వంట పాత్రలన్నీ orchestraగా music రాదా
తగిలిన గాలికి తలుపుల curtain తలూపుతుంటే
వినగల వారికి తెలియకపోదులె melody అంటే
తలగడ మీదకి వాలగానె తలపుల తిల్లానా
మొదలవుతుంది హాయ్ లయపైనా
ఇదిగో ఇపుడే ఆ వరాల పాటను వరించుదామా

East west north south అన్నిచేరితే
డోరెమీకి సాపసాకి తేడాలేదు భాయ్
జావళీకి జాస beat-u జంట కలిపై
జోరా జోరి swing-u మీద జాలి జాలి హోయ్

చిటపట చినుకుల తాళం
చిగురాకులలో హిందోళం
గలగల గాజుల గానం
నా మనసుకు

చిన్ననాటి అమ్మ జోలపాటే నాతో పాటే ఎదిగిందేమో
విన్న వారి కంటిరెప్పపైనే వాలి లాలి అంటుందేమో
ప్రతి హృదయానికి పరుగులు నేర్పద హుషారు నాదం
పగలని రేయని తెలియని చోటికి షికారు పోదాం
పరవశమయ్యే శ్వాసలన్నీ మురళిగ మారేలా
పలికిందీ నా పాట ఈవేళా
యమునా నదినై ఆ స్వరముల నావని నడిపించేదా

East west north south అన్నిచేరితే
డోరెమీకి సాపసాకి తేడాలేదు భాయ్
జావళీకి జాస beat-u జంట కలిపై
జోరా జోరి swing-u మీద జాలి జాలి హోయ్
చిటపట చినుకుల తాళం
చిగురాకులలో హిందోళం
గలగల గాజుల గానం
నా మనసుకు నేర్పెను తానం
ప్రతి కదలిక సంగీతం నేర్పుతున్నదీ
సరిగమలతొ సావాసం చేయమన్నదీ
నీ మాటలే నా పాటలై కచేరి చేయాలి కాలం

చిటపట చినుకుల తాళం
చిగురాకులలో హిందోళం
గలగల గాజుల గానం
నా మనసుకు నేర్పెను తానం
కిలకిల చిలకల మేళం
నను పిలిచిన తొలి భూపాలం
జలజల వాగుల రాగం
నా వయసుకు నేర్పెను వేగం



Credits
Writer(s): Raj-koti, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link