Yemanukunnavu (From "Bangaru Babu")

ఏమనుకున్నావూ నన్నేమనుకున్నావూ
పిచ్చివాడి ననుకున్నావా ప్రేమ బిచ్చగాడి ననుకున్నావా

వెళ్ళినట్టె వెళ్ళావూ కళ్ళలోనె ఉన్నావూ
మరచిపోను వీలులేక మనసులోనె మెదిలావూ
వెళ్ళినట్టె వెళ్ళావూ కళ్ళలోనె ఉన్నావూ
మరచిపోను వీలులేక మనసులోనె మెదిలావూ
పిచ్చివాడి ననుకున్నావా బిచ్చగడి ననుకున్నావా
ఏమనుకున్నావూ నన్నేమనుకున్నావూ
పిచ్చివాడి ననుకున్నావా ప్రేమ బిచ్చగాడి ననుకున్నావా

నిన్నునేను రమ్మన్నానా మనసు నాకు ఇమ్మన్నానా
వచ్చి వలపు రగిలించావూ చిచ్చునాకు మిగిలించావూ

ప్రేమంటేనే బాధన్నారూ ఆ బాధుంటేనే బ్రతుకన్నారూ
అది ప్రేమే కాదంటాను ఆ బ్రతుకే వద్దంటాను
అది ప్రేమే కాదంటాను ఆ బ్రతుకే వద్దంటాను
ఏమనుకున్నావూ నన్నేమనుకున్నావూ
పిచ్చివాడి ననుకున్నావా ప్రేమ బిచ్చగాడి ననుకున్నావా
ప్రేమ బిచ్చగాడి ననుకున్నావా

Credits
Writer(s): Athreya, K V Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link