Neethone

ఆ ఆ ఆ ఆ
నీతోనే ఆగేనా సంగీతం బిలహరి నీతోనే ఆగేనా సంగీతం
బిలహరి అని పిలవకుంటే స్వర విలాసం మార్చుకుంటే ఆరిపోదు గాన జ్యోతి
నీతోనే ఆగేనా సంగీతం

సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన
సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన యుగాలుగా జగాన దారి చూపగ
అనంతమైన కాంతి ధారపోసిన
అఖండమై ప్రభాకరుడు జ్వలించడా నిరంతరం
అఖండమై ప్రభాకరుడు జ్వలించడా నిరంతరం
నీతోనే ఆగేనా సంగీతం

విహంగ స్వనాల ధ్వనించు రాగం ఏది తరంగ స్వరాల జనించు గీతం ఏది
విహంగ స్వనాల ధ్వనించు రాగం ఏది తరంగ స్వరాల జనించు గీతం ఏది
గాలి గొంతు నేర్చుకున్న గానశాస్త్ర గ్రంథమేది
ఏ జ్ఞానం ఆ నాదం
పేరులేక పేదదౌన మ్రోగుతున్న వాన వీణ
పేరులేక పేదదౌన మ్రోగుతున్న వాన వీణ
అహంకరించి సాగుతున్న వేళలో ఎడారిపాలు కాదా జ్ఞానవాహిని
వినమ్రతే త్యజించితే విషాదమే ఫలం కదా
వినమ్రతే త్యజించితే విషాదమే ఫలం కదా
నీతోనే ఆగేనా సంగీతం
మగపద నీతోనే
సరీగ రిగాప గపాద నీతోనే
సరిగ రిగప మగపద మగరిగస గపద మపగద దరి నీతోనే
పాద మగపద రిస రీగ రిగ నిదప ద దాసరిగ దాగసరి గాపదస రీగ సరిగ రిగ పదరి నీతోనే
సరిగ దమగరిగ దమగరి సాస సాస రీరి రీరి సని ద సని ద
పమ గ పమ గ
రిగమప గరి సనిదప ద రిగరి దనిదప మగ సగ సగ నిదప సని సనిద సరిగపద రిగమప దరి
నీతోనే ఆగేన సంగీతం
బిలహరి అని పిలవకుంటే స్వర విలాసం మార్చుకుంటే ఆరిపోదు గాన జ్యోతి
నీతోనే ఆగేనా సంగీతం



Credits
Writer(s): Ilayaraja, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link