Innallu Kudurugunna

ఇన్నాళ్లు కుదురుగున్న చిలిపి అల్లరి
ఎందాక ఆగమన్న ఆగదే మరి
కుందేలు పిల్లలాగ గంతులేయని
మందార పూవు లాగ నవ్వనీ మరి

ఈ క్షణం ఇదే వరం
ఆడదాం మనం
ఈ దినం నే రాణిలా
ఏలనా వనం
నింగిలోని తారలన్ని కొంగుచాటు దాచుకొని
విసురుతాను పూలజల్లు మల్లే

ఇన్నాళ్లు కుదురుగున్న చిలిపి అల్లరి
ఎందాక ఆగమన్న ఆగదే మరి
కుందేలు పిల్లలాగ గంతులేయని
మందార పూవు లాగ నవ్వనీ మరి

చిన్ననాటి ఆటలా అమ్మ లాలిపాటలా
ఉప్పొంగుతోంది ఎందుకో
మనసెందుకో ఎందుకో
ఆకతాయి పిలుపులా ఆగలేని అరుపులా
ఊగుతోంది ఎందుకో
వయసెందుకో ఎందుకో
ఈ కాలాన్ని ఆపాలి కొంచెం
సరాగాన చూపాలి శాంతం
నిన్నలా మొన్నలా ఉండలేను నేనలా
ఓ చిన్న పక్షి లాగ నింగికెగురుతా

ఇన్నాళ్లు కుదురుగున్న చిలిపి అల్లరి
ఎందాక ఆగమన్న ఆగదే మరి
కుందేలు పిల్లలాగ గంతులేయని
మందార పూవు లాగ నవ్వనీ మరి

ఎండ వాన పెళ్లిలా
చందమామ ఎన్నులా
ఊహల్ని దాటినందుకే
ఈ సందడి సందడి
కోకిలమ్మ కూతలా గున్నమావి పూతలా
ఉగాది తీపి పండుగే
ఈ అలికిడి అలికిడి
ఇంకాస్త కంగారు దాచి
నే చేస్తాను గోలగోల లేచి
నువ్వని నేనని ఎవ్వరైతే ఏమని
దోసిట్లో రంగులన్ని చల్లుతా ఇలా

ఇన్నాళ్లు కుదురుగున్న చిలిపి అల్లరి
ఎందాక ఆగమన్న ఆగదే మరి
కుందేలు పిల్లలాగ గంతులేయని
మందార పూవు లాగ నవ్వనీ మరి



Credits
Writer(s): Vijay Balaji, Vamshi Kandala
Lyrics powered by www.musixmatch.com

Link