Edho Edho Bagunde

ఎదో ఎదో బాగుందే
ఎంతో ఎంతో బాగుందే
నీతో చెప్పాలనుకుందే
నువ్వంటు ఉంటే బాగుందే
నీకు నాకు తెలిసిందే
నిన్ను నన్ను కలిపిందే
నువ్వు నేను తలచిందే
నిజమౌతుంటే బాగుందే
ప్రియ స్వాగతం సుస్వాగతం
నా హృదయముంది నీ కొరకే
ఇన్నాళ్ళుగా గడిచిన గతం వేచింది ఈ క్షణానికే
తెల తెల్లని ఎద కాగితం
నీ కలలు నిండి కళలొలికే
లేదే ఇక ఏ కోరికే
పిలిచే పెదాల ముంగిట వరాల జల్లుగ వరించి వాలెను వెన్నెల చినుకే

ఎంతిష్టం నువ్వంటే నేనేమి చెప్పను
నా ఊపిరి నువ్వంటూ నేనెలా చూపను
నువ్వే తిరిగిమ్మన్నా నేనివ్వలేను నాలో ఉన్న నిన్ను
నీ రాకకు మునుముందుగా నిశ్శబ్ధమే నా సంబరం
నా జీవితం పేరిప్పుడు అందాల అద్భుతం
ఈ గుండెపై చేసావులే నీ వలపు సంతకం
ఆకాశం తాకిందే ఆనందం

ప్రియ స్వాగతం సుస్వాగతం
నా హృదయముంది నీ కొరకే
ఇన్నాళ్ళుగా గడిచిన గతం వేచింది ఈ క్షణానికే
తెల తెల్లని ఎద కాగితం
నీ కలలు నిండి కళలొలికే
లేదే ఇక ఏ కోరికే
పిలిచే పెదాల ముంగిట వరాల జల్లుగ వరించి వాలెను వెన్నెల చినుకే



Credits
Writer(s): Mickey J Meyer, Ramajogaiah Sastry
Lyrics powered by www.musixmatch.com

Link