Chamanthi Poobanthi - 1

చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా
జోలాలి జోజో లాలి జో
నే జోల పాటవుతా నువ్వు నిద్ర పోతేను
నవ్వించే ఆటవుతా నువ్వు ఆడుకుంటేను
ఏ దేవుడు రానే రాలేడే నా కన్నమ్మా
మన అమ్మను తేనేతేలేడే

చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో

ఆ కాలం గుచ్చింది కళ్ళల్లో ముళ్ళన్నీ
నే తీస్తా ముళ్ళన్నీ నువ్వేలే నాకన్నీ
కష్టాలు ఎన్నైనా నీకోసం పడతాను
మన అమ్మను తెమ్మంటే ఏ కాళ్ళను పడతాను
అమ్మలేని బ్రహ్మ రాత రాసినాడు
అమ్మనెత్తుకెళ్లి కోత కోసినాడు
నీకంటే నాకెవరున్నారే నా చెల్లెమ్మా
మన కన్న తల్లివి నువ్వమ్మా

చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో

నేలమ్మకు ఏదమ్మా బువ్వెట్టే వాళ్ళమ్మా
ఆకాశంకేదమ్మా ఆడిగిందిచ్చే తన అమ్మా
ఆ రాత నీ కేంటి నేనున్నా లోటేంటి
నీ తోడే నా లోకం తోడియ్యన నా ప్రాణం
ఇందుకే నేను ముందు పుట్టినాను
అమ్మ లా చూసే అన్ననైనాను
నీ ముందు ప్రాణాలెంతమ్మా నను కన్నమ్మా
నీకోసం నేనున్నానమ్మా

చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా
జోలాలి జోజో లాలి జో
నే జోల పాటవుతా నువ్వు నిద్ర పోతేను
నవ్వించే ఆటవుతా నువ్వు ఆడుకుంటేను
ఏ దేవుడు రానే రాలేడే నా కన్నమ్మా
మన అమ్మను తేనేతేలేడే

చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో



Credits
Writer(s): Sriharsha, S A Rajkumar
Lyrics powered by www.musixmatch.com

Link