Sarada Sarada (From "Sarada")

శారదా నను చేరగా
శారదా నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా
ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా
ఓ శారదా నీరదా శారదా

శారదా నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా
ఓ ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా
ఏమి రూపమది ఇంద్ర చాపమది
ఏమి కోపమది చంద్ర తాపమది
ఏమి రూపమది ఇంద్ర చాపమది
ఏమి కోపమది చంద్ర తాపమది
ఏమి ఆ హొయలు
ఏమి కులుకు సెలయేటి పిలుపు
అది ఏమి అడుగు కలహంస నడుగు
హోయ్ ఏమి ఆ లయలు
కలగా కదిలే ఆ అందం
కలగా కదిలే ఆ అందం
కావాలన్నది నా హృదయం
కావాలన్నది నా హృదయం
ఓ శారదా నీరదా శారదా

శారదా నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా
ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా
నీలి కళ్లలో
నా నీడ చూసుకొని
పాల నవ్వులో పూలు దోచుకొని
నీలి కళ్ళలో నీడ చూసుకొని
పాల నవ్వులో పూలు దోచుకొని
పరిమళించేనా
చెండువోలే విరిదండవోలే
నిను గుండె కద్దుకొని
నిండు ముద్దు గొని పరవశించేనా
అలలై పొంగే అనురాగం
అలలై పొంగే అనురాగం
పులకించాలి కలకాలం
పులకించాలి కలకాలం
ఓ శారదా నీరదా శారదా

శారదా నను చేరగా
శారదా నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా
ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా
ఓ శారదా నీరదా శారదా



Credits
Writer(s): Shibu Chakravarthi, Dr. C Narayana Reddy
Lyrics powered by www.musixmatch.com

Link