Ayya Baaboi (From "Ami Thumi")

అయ్ బాబోయ్ అయ్ బాబోయండి అయ్ బాబోయండి
ఇక చంపుకు తినక సంగతి ఏంటో సరిగా చెప్పు
సరిగా అంటే సరిగమపదనిస సనిదపమగరిస
అసలైందండి మొదలైందండి చూద్దాంరండి
వస్తే కాదంటానా
Ho ooo ooo O O
ఇస్తే చేదంటానా
Ho ooo ooo O O
చాల్లేవోయ్ బెట్టు ఎంతవరకు
ఏదీ ఇల్లా రద్దు అంత బెరుకెందుకు
దేనికింత తొందర అంటూ పదిమంది నవ్వుకోరా
మగపురుషుడికేంటీ గాబరా
అయ్ బాబోయ్ అయ్ బాబోయండి అయ్ బాబోయండి

కొంచెం దూరం ఉండని మాట మంతి సాగని
చీ అదేంటి ఉత్తుత్తి మాటలేనా
కరుణించవే కన్యామణి అసలే నే కుర్రాడిని
కనుకే కద కవ్విస్తున్నా
అటు ఇటని పరుగు పెడితే
పడుచుదనం పరువు చెడిపోదా
ఒంటరి కన్నెవి, కనీసం కంగారైనా లేదా
ఉంది గాని అది వేరేలాంటిది
అయ్ బాబోయ్ అయ్ బాబోయండి పాపాయండి

ఇంతపనైపోతుందని అనుకోలేదే అమ్మనీ
చ ఇంతేనా ముందింక చాలా ఉంది
గుప్ చుప్ పనిగా చేయనీ గుప్పిట్లో ఈ నిప్పుని
అసలిపుడేగా కనువిప్పు
అడ్డుపడకు ఆగమనకు
ఒంటి ఉడుకు ఉఫ్ మని ఊదకు
పసిపరువాలకు ప్రమాదం కాదా పైకి రాకు
త్వరపడు మరి జత జగడాలకు
అయ్ బాబోయ్ అయ్ బాబోయండి అయ్ బాబోయండి
ఆ హహకారం హోహోకారం విన్నవా
అది హహాకారం ఆవకాయ్ కారం కాదండి
ఆహాకారం ఆహాకారం ఆహా ఆహా ఆహా... కారం



Credits
Writer(s): Mani Sarma, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link