Oh Vannekaadaa

ఆ... ఆ... ఆ... ఊ ఊ . ఆ.ఆ.ఆ.
ఓ వన్నెకాడ ఊ.
ఓ వన్నెకాడ నిన్ను చూచి నామేను పులకించెరా ఓవీ రా నన్నేలి కులికించరా

ఓ వన్నెకాడ నిన్ను చూచి నామేను పులకించెరా ఓవీ రా నన్నేలి కులికించరా
మరులు పెంచే మంచిగంధం మల్లెపూపాన్పు వేచేనోయి
మరులు పెంచే మంచిగంధం మల్లెపూపాన్పు వేచేనోయి
నీ దయగోరి నిలచేనోయీ
ఓ వన్నెకాడ నిన్ను చూచి నామేను పులకించెరా ఓవీ రా నన్నేలి కులికించరా

ఉరుకుల పరుగుల దొరా
మగసిరికిది తగదురా
ఉరుకుల పరుగుల దొరా నీ మగసిరికిది తగదురా
ఆ... ఆ... ఆ.
ఉరుకుల పరుగుల దొరా.
చూడరా యిటు చూడరా సరి యీడుజోడు వన్నెలాడినేరా!ఓయ్
చూడరా యిటు చూడరా సరి యీడుజోడు వన్నెలాడినేరా!ఓయ్
వలపు గొలిపే బింకాల కళలతనిపే పొంకాల
వదిలిపోకురా ...
ఉరుకుల పరుగుల దొరా నీ మగసిరికిది తగదురా
ఆ... ఆ... ఆ.
ఉరుకుల పరుగుల దొరా.

ఆ... ఆ... ఆ
తాళలేరా మదనా! మదనా మదనా మదనా...
నే తాళలేరా మదనా మదనా మదనా మదనా
నే తాళలేరా మదనా
విరులశరాల వేగితి చాల విరహమోర్వజాల...
ఆ... ఆ. ఆ... ఆ
విరులశరాల వేగితిచాల విరహమోర్వజాల...
ఇలలో లేని అమరసుఖాల తేలజేతు వేగ ఎదను గదియర
తాళలేరా మదనా
తాళలేరా మదనా! మదనా మదనా మదనా
నే తాళ,నే తాళ, ఇకతాళ లేరా మదనా

Credits
Writer(s): Samudarala, Ghantashala Ghantashala
Lyrics powered by www.musixmatch.com

Link