Ee Andhaniki

ఈ అందానికి బంధం వేశానొకనాడు
ఆ బంధమే నాకందమైనది ఈ నాడు
ఈ అందానికి బంధం వేశానొకనాడు
ఆ బంధమే నాకందమైనది ఈ నాడు

నీ కళ్ళు ఆనాడు ఎరుపెక్కెను నేడు ఆ ఎరుపె నీ బుగ్గపై పాకెను
ఊహూ ఊహూ హూ హూ హూ
నీ కళ్ళు ఆనాడు ఎరుపెక్కెను నేడు ఆ ఎరుపె నీ బుగ్గపై పాకెను
నీ చేతులానాడు చెరలాయెను నేడు ఆ చెరలె కౌగిలై పెనవేసెను...
ఊహూ ఊహూ హూ హూ హూ
ఈ అందానికి బంధం వేసానొకనాడు
ఆ బంధమే నాకందమైనది ఈ నాడు

నీ వేడిలోనే నా చలువ ఉందని వాన ఎండను చేరింది
నీ చలువే నా వేడికి విలువని ఎండే వానను మెచ్చింది
నీ వేడిలోనే నా చలువ ఉందని వాన ఎండను చేరింది
నీ చలువే నా వేడికి విలువని ఎండే వానను మెచ్చింది
ఇద్దరు కలిసిన ఆ ఒద్దికలో ఇంధ్రధనస్సే విరిసింది
ఏడు రంగుల ముగ్గులు వేసి నింగీ నేలను కలిపింది
ప్రేమకు పెళ్ళే చేసింది
ఈ అందానికి బంధం వేసానొకనాడు
ఆ బంధమే నాకందమైనది ఈ నాడు
ఆహాహా ఆహాహా ఆహాహా ఆహాహా
ఆహాహా ఆహాహా ఆహాహా ఆహాహా
ఆహాహా ఆహాహా ఆహాహా ఆహాహా



Credits
Writer(s): Athreya, J. V. Raghavulu
Lyrics powered by www.musixmatch.com

Link