Inthakante Vere (Version 1)

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకోమరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరుగదు మనసీ మాదిరి
ఎందుకంటె ఏమో ఎందుకూ అని తెలియక తికమక పడుతున్నది మది
ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకోమరి
ఎందరేదురైనా సుందరాంగులు తడబడి ఎరుగదు మనసీ మాదిరి

కోపగించి బుంగమూతి పెట్టినా
నిరాకరించి పళ్ళు నూరి తిట్టినా
మహాద్భుతం అనేట్టుగానే ఉంది అనుకున్నా
ఇదేదో పిచ్చి కదా మరీ అనెవ్వరైన అంటె నిజమేనని ఒప్పేసుకుంట
అంతేగాని తన వెనకనే పడిన మనసునీ
ఒద్దొద్దు అని నేనేమైన ఆపగలనా

కత్రినా కరీన అంటు కొంతమంది
కోసమే కుర్రాళ్ళు అంత కొట్టుకుంటె
లోకమందు ఇన్ని వేల జంటలుండవేమో
నా కళ్ళతో చూస్తే సరీ నిన్ను మించి మరొకరు లేరనీ అంటారు కద
ఎవ్వరైన అలా అన్నారని ఊరంతా వచ్చి నిన్నె నా కళ్ళతోటి చూస్తనంటే చూడగలనా

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకోమరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరుగదు మనసీ మాదిరి
ఎందుకంటె ఏమో ఎందుకూ అని తెలియక తికమక పడుతున్నది మది
యాహూ.ఊఊఊ... హూ... హూ...
యాహూహూ... హూహూ...
యాహూ.ఊఊఊ... హూ... హూ...
యాహూహూ... హూహూ...

Credits
Writer(s): Kalyan Koduri, Sirivennela Sitaramasastry
Lyrics powered by www.musixmatch.com

Link