Anaganaga Oka Roju

హే పిల్లలు మీకొక కొత్త కధ చెప్తా
కొత్త కధ అని చెత్త కధ చెప్పావంటే నీకుంటది
అబ్బా ముందు వినండ్రా
వింటే కదా తెలిసేది

అనగనగా ఒక రాజు, ఆ రాజు బిడ్డలు ఏడుగురు
వాళ్లంతా కలిసి మెలిసి
ఏదో చెసార్రా

Old story మాక్తెలీదా
అనగనగా ఒక రాజు ఆ రాజు బిడ్డలు ఏడుగురు
వాళ్లంతా కలిసి మెలిసి వేటకు వెళ్ళుంటారు
హరీ పాటర్ లాంటివి చెప్తారనుకుంటే
మీరేంటి uncle రాజులు వాళ్ళ అబ్బాయిలు

అబ్బాయిలు అని ఎవరన్నారా అమ్మాయిలు
Girls-a అయితే interesting

అమ్మాయిలందరూ వేటకి కాదు shopping కెళ్ళారు
ఈ అమ్మాయిలెప్పుడు ఇంతే shopping అని డబ్బులు తగలేస్తారు
తమ taste-uకు తగిన వరుడిని వెతకగా world-ఏ తిరిగారు
గూగుల్ ఫేస్బుక్ ఉండుండవులే పాపం poor people

వరుడంటే అల్లు అర్జునా
Mister పెళ్లి కొడుకులో సునీలా
ఆ కాదు రా రాజుల కాలం కాదా
వాళ్లకి కావాల్సిన అబ్బాయి వీరుడై శూరుడై
గుర్రం మీద కత్తి యుద్ధం చేసి వంద మందిని ఓడించాలని వాళ్ళకోరిక
ఓ మగధీర
అవునురా కానీ budget లేదు కాదా graphics లేని మగధీర

ఒక్కొక్కడ్ని కాదు షేర్ఖాన్ ఏడుగురిని ఒకేసారి పెళ్లిచేసుకుంటా
ఇక్కడ ఒక పెళ్ళాన్ని manage చేసుకోలేక పోతున్నాను
ఇంకా ఏడుగురిని చేసుకుంటే ఇంటికెళ్ళడు direct-u అడవికే
ఆమ్మో అడివంటే సింహాలుంటాయ్ కద uncle
అర్ no fear yaar అవన్నీ graphics

హ story మొత్తం మీరే చెప్పేసుకోండ్రా
నేనెందుకు ఇక్కడ తొక్కలాగా
Okay okay నువ్వే చెప్పులే

హే ఇంకేముంది graphics లో సింహానే గెలిచాడు
హే నేనంటే నేనని రాజకుమార్తెలు propose చేసేసారు

మరి మగధీర ఎం చేసాడు
graphics ఉన్నాయిగా

ఆ graphicsలో ఆ ఏడుగురిని ఒక్కటిగా చేసేసాడు
ఆ అమ్మాయిని పెళ్ళాడేసి తన kingdom వీళ్ళిపోయాడు

హే అనగనగా ఒక రాజు ఆ రాజు బిడ్డలు ఏడుగురు
తమ heroనే పెళ్ళాడేసి తమ ఊరెళ్ళిపోయారు



Credits
Writer(s): Sai Kartheek, Jakka Hari Prasad
Lyrics powered by www.musixmatch.com

Link