Okka Puta Annam

ఒక్కపూట అన్నం కోసం ఎదురు చూడడం
జానెడంత ఊపిరి కోసం చెయ్యి చాచడం
కడుపు కాలి కాలి ఇక్కడ బూడిద అవుతున్నా
మనిషి అన్న వాడికి మనసే లేకపోయెనన్నా
ఉన్నవాడే కొంచం ఇస్తే లేని వాడె ఉండడే
కళ్ళు తెరచి చూడు దేవుడా అందరు నీ పిల్లలే

ఒక్కపూట అన్నం కోసం ఎదురు చూడడం
జానెడంత ఊపిరి కోసం చెయ్యి చాచడం

అన్ని ఉన్న ఏదో కోరి చెయ్యి చాచి అడిగే లోకం
పుట్టిన ప్రతి వాడు ఇక్కడ పెద్ద బిచ్చగాడేరా
పుట్టబోయే మనవడి కోసం ఉన్నవాడు కూడబెడితే
గూడులేని వాడికి పాపం దేవుడే మాత్రం దిక్కుర
నువ్వెతికే ఆ ఏదో ఒక్కటి దొరకక పొగా నీకు
అవమానం ఎదురవ్వును ఇక్కడ దినదినము ప్రతిదినము
ఏముందని ఇన్నాళ్లుగ నీకు జీవించావురా నువ్వు
ఆ ధైర్యం నువ్వు వీడక ఉండరా దేవుడే అండరా నీకు

ఒక్కపూట అన్నం కోసం ఎదురు చూడడం
జానెడంత ఊపిరి కోసం చెయ్యి చాచడం
కడుపు కాలి కాలి ఇక్కడ బూడిద అవుతున్నా
మనిషి అన్న వాడికి మనసే లేకపోయెనన్నా
ఉన్నవాడే కొంచం ఇస్తే లేని వాడె ఉండడే
కళ్ళు తెరచి చూడు దేవుడా అందరు నీ పిల్లలే



Credits
Writer(s): Vijay Antony, Shaik A K Basha
Lyrics powered by www.musixmatch.com

Link