Sri Suryanarayana Meluka

శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో
మా చిలకమ్మ బులపాటము
చూసిపో చూసిపో
శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో
మా చిలకమ్మ బులపాటము
చూసిపో చూసిపో
తెల్లావారక ముందే ఇల్లంతా పరుగులు
చీకట్లో ముగ్గుల్లు చెక్కిట్లో సిగ్గుల్లు
ఏమి వయ్యారమో ఎంత విడ్డూరమో
ఎంత విడ్డూరమో

శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో
మా అమ్మమ్మ ఆరాటము
చూసిపో చూసిపో
చిట్టీ మనవడి రాక చెవిలోన పడగానే
ముసి ముసి చీకట్లు ముసలమ్మ రాగాలు
ఏమి జాగారమో ఎంత సంబరమో
ఎంత సంబరమో
సరిగంచు పైట సవరింకున్నా
మరీ మరీ జారుతోంది
ఓసోసి మనవరాల ఏం జరిగింది
ఓసోసి మనవరాల ఏం జరిగింది
తాతయ్యని నువ్వు తలచిన తొలి నాడు
నీకేమి జరిగిందో అమ్మమ్మ
తాతయ్యని నువ్వు తలచిన తొలి నాడు
నీకేమి జరిగిందో అమ్మమ్మ
నాకంతే జరిగింది అమ్మమ్మ
అమ్మ దొంగా రంగ రంగా
అమ్మ దొంగా రంగ రంగా

శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో
మా అమ్మమ్మ ఆరాటము
చూసిపో చూసిపో
కోడిని కొడితే సూర్యుడ్ని లేపితే
తెల్లారి పోతుందా
ఓ పిల్ల పెళ్లి ఘడియ వస్తుందా
ఓ పిల్ల పెళ్లి ఘడియ వస్తుందా
దిగివచ్చే బావను క్షణమైన ఆపితే
దేవుడ్ని నిలదీయనా
ఓయమ్మో కాలాన్ని చుట్టెయ్యనా
నా పిచ్చి తల్లి ఓ బుజ్జి మల్లి
నీ మనసే బంగారం
నూరేళ్లు నిలవాలి ఈ మురిపెం
నూరేళ్లు నిలవాలి ఈ మురిపెం
అమ్మమ్మ మాట ముత్యాల మూట
ఆ విలువ నే నెరుగనా
ఏనాడూ అది నాకు తొలి దీవెనా

శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో
మా చిలకమ్మ బులపాటము
చూసిపో చూసిపో
శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో
మా అమ్మమ్మ ఆరాటము
చూసిపో చూసిపో



Credits
Writer(s): Narayana Reddy C, Mahadevan K V, Puhalendi
Lyrics powered by www.musixmatch.com

Link