Ee Thoopupu

ఈ తూరుపు ఆ పశ్చిమం
సంగమించిన ఈ శుభవేళ
పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే

యూ ఆవకాయ్ మి ఐస్ క్రీమ్
దిసీజ్ ద హాట్ అండ్ స్వీట్ లవ్ స్ట్రీం
యునైటెడ్ స్టేట్సాఫ్ హార్ట్స్ వి హావ్ లైక్ ఇండియన్ నమస్తే

ఆకాశంలో తార సుడిగాలి కారని దీపం
గుడి లేని దైవం కోసం ఒడి చేరుకున్నదిలే

సాగరంలో కెరటం ఉప్పొంగిన నా హృదయం
అలిసేది కాదనురాగం ఈ జన్మ సంగీతం

గ్రహణాలు లేని ఆ తారలన్నీ గగనాన కలిసీ ఈ వేళలోని
కలిసింది ఈ బంధం కలిసింది ఈ బంధం

ఈ తూరుపు ఆ పశ్చిమం
సంగమించిన ఈ శుభవేళ
పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే

లేడీస్ అండ్ జెంటిల్ మెన్
దిస్ ఈజ్ యువర్ కెప్టెన్ స్పీకింగ్ ఫ్రమ్ ద కాక్ పిట్
ఇట్స్ అన్ ఫార్చునేట్ వి కాట్ ఫైర్ ఆన్ ఆల్ ద ఇంజన్స్
ఐ అడ్వైస్ యు టు పుట్ ఆన్ యువర్ పారాచుట్స్
ఆండ్ బైల్ అవుట్ ఇమ్మీడియట్లీ

చైత్ర కోయిలలెన్నో మైత్రి వేణువులూదే
మనసైన మాటలకోసం మౌనాల ఆశలు పూసే

ఏడేడు రంగుల దీపం ఆ నింగిలో హరిచాపం
అరుణాల రుధిరంతోనే ఋణమైనదీ ప్రియ బందం

ఏ దేశమైనా ఆకాశమొకటే ఏ జంటకైనా అనురాగమొకటే
అపురూపం ఈ ప్రణయం అపురూపం ఈ ప్రణయం

ఈ తూరుపు ఆ పశ్చిమం
సంగమించిన ఈ శుభవేళ
పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే

యూ ఆవకాయ్ మి ఐస్ క్రీమ్
దిసీజ్ ద హాట్ అండ్ స్వీట్ లవ్ స్ట్రీం
హు హు హు హూ హు హూ హు హు హు హు హు



Credits
Writer(s): Annamacharya, Balasubrahmanyam S P
Lyrics powered by www.musixmatch.com

Link