Andelu Pilachina

అందెలు పిలిచిన అలికిడిలో

అణువణువున అలజడులూ

యద పదమొకటౌ లాహిరిలో
యద పదమొకటౌ లాహిరిలో
ఎన్నడు ఎరగని వురవడులూ
ఇది నా ప్రియ నర్తన వేళ
తుది లేనిది జీవన హేల
ఇది నా ప్రియ నర్తన వేళ
తుది లేనిది జీవన హేల
ఇది నా ప్రియ నర్తన వేళ

ఉత్తరాన ఒక ఉరుము వురిమినా
ఉలికి చిలిపి మెరుపొకటి మెరిసినా

ఉత్తరాన ఒక ఉరుము వురిమినా, ఉలికి చిలిపి మెరుపొకటి మెరిసినా
ఒక కదలిక
చిరు మెదలిక
గిలిగింతగ జనియించగా
ఒక కదలిక చిరు మెదలిక గిలిగింతగ జనియించగా
నాలుగు దిక్కుల నడుమ పుడమి నా వేదికగా నటన మాడనా

నాలుగు దిక్కుల నడుమ పుడమి నా వేదికగా నటన మాడనా
అనంత లయతో నిరంత గతితో జతులు పాడనా ఆడనా

ఇది నా ప్రియ నర్తన వేళ తుది లేనిది జీవన హేల
ఇది నా ప్రియ నర్తన వేళ

మేఘ వీణ చలి చినుకు చిలికినా
మేను లోన చిరు అలలు కదలినా

మేఘ వీణ చలి చినుకు చిలికినా, మేను లోన చిరు అలలు కదలినా
ఒక లహరిక
మధు మదనిక
వలవంతగ జనియించగా
ఒక లహరిక మధు మదనిక వలవంతగ జనియించగా
సుగమ నిగమ సుధ ఎడద పొంగగా వరదలాగా ఉప్పొంగనా

సుగమ నిగమ సుధ ఎడద పొంగగా వరదలాగా ఉప్పొంగనా.
వరాళి ఎదలొ స్వరాల రొదలో స్వరము పాడనా ఆడనా.

ఇది నా ప్రియ నర్తన వేళ తుది లేనిది జీవన హేల
ఇది నా ప్రియ నర్తన వేళ



Credits
Writer(s): Balasubrahmanyam S P, Mankomp Gopalakrishnan
Lyrics powered by www.musixmatch.com

Link