O Nene O Nuvvani

ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని నీ గూటికే రానీ
నేనంటూ ఇక లేనని నీ వెంటే వున్నానని చాటనీ
చేశానే నీ స్నేహాన్ని పోల్చానే నా లోకాన్ని నీ వాణ్ణి

ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని నీ గూటికే రానీ

మారము చేసే మా రాణి ఊసే నాలోన దాచానులే
గారాలు పోయే రాగాల హాయే నా గుండెనే తాకేనే
నీ కొంటె కోపాలు చూడాలనే దోబూచులాడెను ఇన్నాళ్ళుగా
సరదా సరాగాలు ప్రేమేగా

ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని నీ గూటికే రానీ

నీ నీడలాగ నీతోనే వున్నా నీ జంట నేనవ్వనా
వేరేవ్వరున్న నీ గుండెలోన నా కంట నీరాగునా

ఆ తలపు నా ఊహ కే తోచునా నా శ్వాస నిను వీడి జీవించున
నీ కంటి పాపల్లె నే లేనా

ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని నీ గూటికే రానీ
నేనంటూ ఇక లేనని నీ వెంటే వున్నానని చాటనీ
చేశానే నీ స్నేహాన్ని పోల్చానే నా లోకాన్ని నీ వాణ్ణి



Credits
Writer(s): Vanamali, Sharath Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link