Dochestha

జయ కృష్ణ ముకుంద మురారి
జయ జయ కృష్ణ ముకుంద మురారి

మీ కష్టాలన్నీ దోచేస్తా కన్నీళ్ళన్నీ దోచేస్తా
చీకు చింత దోచేస్తా చీకటినంతా దోచేస్తా
భయాలన్నీ దోచేస్తా భారాలన్నీ దోచేస్తా
అప్పు సొప్పు దోచేస్తా ఆపదనంతా దోచేస్తా
ఏ మూర్తి బాబాయ్ ఏ జ్యోతి అత్తాయి
మీ చేతిలో దాగిన వంకర గీతను నుదుట రాసిన వంకర రాతను వెంట వెంట పడి ఎత్తుకెళ్ళిపోతా
జంతర్ మంతర్ జాదూ చేసి అందరి బాధలు దోచేస్తా
చిందర వందర చిందులు వేసి గందరగోళం చేసేస్తా

కల్లా కపటం లేని పిల్లాడినై వస్తా నే వస్తా
మీరెళ్ళే దారుల్లోని ముళ్ళన్నిటినీ ఏరేస్తా పారేస్తా
సంద్రంలోని ఉప్పు ని మొత్తం చదువుల్లోని తప్పులు మొత్తం
ఉద్యోగంలో తిప్పలు మొత్తం మాయం చేసేస్తా
జాబిలి లోని మచ్చలు మొత్తం కూరలలోని పుచ్చులు మొత్తం
దేశం లోని చిచ్చులు మొత్తం దూరం చేసేస్తా
జంతర్ మంతర్ జాదూ చేసి అందరి బాధలు దోచేస్తా
చిందర వందర చిందులు వేసి గందరగోళం చేసేస్తా

రాముడి గుణమే కలిగిన క్రిష్ణయ్యలా వస్తా నే వస్తా
చీరల బదులు మీలో చెడు లక్షణాలే లాగేస్తా దాచేస్తా
నవ్వుల మాటున ఏడుపులన్నీ ప్రేమల మాటున ద్వేషాలన్నీ
వేషం మాటున మోసాలన్నీ స్వాహా చేసేస్తా
రంగుల మాటున రంగాలన్నీ మాటల మాటున మర్మాలన్నీ
సాయం మాటున స్వార్థాలన్నీ సఫా చేసేస్తా
జంతర్ మంతర్ జాదూ చేసి అందరి బాధలు దోచేస్తా
చిందర వందర చిందులు వేసి గందరగోళం చేసేస్తా

అరెరెరె వెన్న కృష్ణ దోచెయ్ దోచెయ్
చిన్ని కృష్ణ దోచెయ్ దోచెయ్
ముద్దు కృష్ణ దోచెయ్ దోచెయ్
మొద్దు కృష్ణ దోచెయ్ దోచెయ్
Cute కృష్ణ దోచెయ్ దోచెయ్
Flute కృష్ణ దోచెయ్ దోచెయ్
Naughty కృష్ణ దోచెయ్ దోచెయ్
Beauty కృష్ణ దోచెయ్ దోచెయ్
గోకుల కృష్ణ దోచెయ్ దోచెయ్
గోపాల్ కృష్ణ దోచెయ్ దోచెయ్
దోచెయ్ ఆ దోచెయ్ దోచెయ్ దోచెయ్...



Credits
Writer(s): Devi Sri Prasad, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link