Thaka Dhimi Thaka

తకధిమితక ధిమితకధిమి తకధిమి తక ధింధిం
జత జత కొక కధ ఉన్నది చరితైతే ఝం ఝం
తకధిమితక ధిమితకధిమి తకధిమి తక ధింధిం
జత జత కొక కధ ఉన్నది చరితైతే ఝం ఝం
ఒక ఇంటికి ముఖ ద్వారం ఒకటుంటే అందం ఒక మనసుకు ఒక మనసని అనుకుంటే స్వర్గం
ఒక ఇంటికి ముఖ ద్వారం ఒకటుంటే అందం ఒక మనసుకు ఒక మనసని అనుకుంటే స్వర్గం
తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధింధిం
జత జత కొక కధ ఉన్నది చరితైతే ఝం ఝం

ఈ లోకమొక ఆట స్థలము ఈ ఆట ఆడేది క్షణమూ
ఈ లోకమొక ఆట స్థలము ఈ ఆట ఆడేది క్షణమూ
ఆడించు వాడెవ్వడైనా ఆడాలి ఈ కీలుబొమ్మా
ఆడించు వాడెవ్వడైనా
ఆడాలి ఈ కీలుబొమ్మా
ఇది తెలిసీ తుది తెలిసీ ఇంకెందుకు గర్వం తన ఆటే గెలవాలని ప్రతి బొమ్మకు స్వార్ధం
ఇది తెలిసీ తుది తెలిసీ ఇంకెందుకు గర్వం తన ఆటే గెలవాలని ప్రతి బొమ్మకు స్వార్ధం
తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధింధిం
జత జత కొక కధ ఉన్నది చరితైతే ఝం ఝం

వెళ్తారు వెళ్ళేటి వాళ్ళు చెప్పేసెయ్ తుది వీడుకోలూ
ఉంటారు రుణమున్న వాళ్ళూ వింటారు నీ గుండె రొదలు
కన్నీళ్ళ సెలయేళ్ళు కాకూడదు కళ్ళు కలలన్నీ వెలుగొచ్చిన మెలుకువలో చెల్లు

ఏనాడు గెలిచింది వలపూ తానోడుటే దాని గెలుపూ
ఏనాడు గెలిచింది వలపూ తానోడుటే దాని గెలుపూ
గాయాన్ని మాన్పేది మరుపు ప్రాణాల్ని నిలిపేది రేపూ
గాయాన్ని మాన్పేది మరుపు ప్రాణాల్ని నిలిపేది రేపు
ప్రతి మాపూ ఒక రేపై తెరవాలి తలుపు ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు
ప్రతి మాపూ ఒక రేపై తెరవాలి తలుపు ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు
తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధింధిం
జత జత కొక కధ ఉన్నది చరితైతే ఝం ఝం
ఒక ఇంటికి ముఖ ద్వారం ఒకటుంటే అందం ఒక మనసుకు ఒక మనసని అనుకుంటే స్వర్గం

సాహిత్యం: ఆత్రేయ

Credits
Writer(s): Athreya, M. S. Viswanathan
Lyrics powered by www.musixmatch.com

Link