The Soul of Telugu (Adhilekka)

అది లెక్క దరువే రోరన్న
తకధిన్న
కూని రాగం ఎత్తుకున్నా
పక్క తాళం అందుకోనా
తేనె కన్న తీయనైనా
కమ్మనైన తెలుగన్నా
గొంతు తీరా పాడుకుంటే ఆ హాయ్ వేరన్నా
భారతంబ మువ్వల పట్టిలో
యాభైయారు అక్షరాల ఘల్ ఘల్ తెలుగన్నా
మూడు లింగాల నెలంటూ నింగి గంగే జారీ తెలుగాళ్లే మారిందన్న
అణువణువు మన పుట్టుక నుంచే ఒంట్లో చేరే ఊపిరి గాలి
తెలుగు భాషే అన్న
అడుగడుగూ కట్టు బొట్టు మాట తీరు తేనై మంతో నడిచే
పూల దారే అన్న

అమ్మ గోరు ముద్దే మన అచ్చ తెలుగన్నా
Pizza burger పైన పిచ్చి మోజే వొద్దన్న
ఏనాడైనా మనకు ఇది పేగు తీగన్నా
తెగిపోని బంధం ఏ చోటే ఉన్న

అన్నమయ్య పదాల గలా గలా తెలుగన్నా
కూచిపూడి వయ్యారాలు మిల మిల తెలుగన్నా
రంగు రంగుల బాపు కుంచె కల కళ తెలుగన్నా
రామ రాగల త్యాగయ్య పాటే తెలుగన్నా
విశ్వనాధ కిన్నెర సాన్నన్నా నండూరోళ్ల
నాజూకు ఎంకే తెలుగన్నా
శేషేంద్ర గోషే తెలుగన్నా
చలం, జాషువా, శ్రీశ్రీ చేవ్రాలే తెలుగయిందన్న
పొరుగింటి ఇరు భారతియ్యారే సుందర తెలుగు
అన్నాడన్న మెచ్చుకున్నాడన్న
అలనాటి పలు భాషల కన్నా ముందే పుట్టిన పెద్దన్నంటే మన తెలుగేనాన్న

అమ్మ గోరు ముద్దే మన ఆచ తెలుగన్నా
Pizza burger పైన పిచ్చి మోజే వొద్దన్న
ఏనాడైనా మనకు ఇది పేగు తీగన్నా
తెగిపోని బంధం ఏ చోటే ఉన్న

పెరు గొప్ప foreign-u scent-u
ఎంత ఘుమ్ గుమ్మని అన్నా
మనం పుట్టి పెరిగిన నెల మట్టి వాసన ఇంకా గొప్పన్న
ఏ దేశాన వేషాలు ఎట్టాగే ఉన్న
నిండు తెలుగింటి లాంగా ఓని హుందానే మిన్న
సోకు బలే పానీయాల సీసాలెన్నున్నా
లేత కొబ్బరి నీళ్ల చలువే తెలుగన్నా
జగమంత నలు దిక్కుల చుక్కల ఎట్టునా ఉండే తెలుగన్నా
మన తెలివేనన్న
నలుసంతా సందేహమే లేని లేదంటున్న ఈ సీమలో ఎదో వెలుగుందన్నా

అమ్మ గోరు ముద్దే మన అచ్చ తెలుగన్నా
Pizza burger పైన పిచ్చి మోజే వొద్దన్న
ఏనాడైనా మనకు ఇది పేగు తీగన్నా
తెగిపోని బంధం ఏ చోటే ఉన్న



Credits
Writer(s): Ramajogayya Sastry, Yuvan Shankar Raja
Lyrics powered by www.musixmatch.com

Link