Nuvvele Nuvvele (From “Jaya Janaki Nayaka”)

నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే
చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే
నడవలేని చోటులోన పూల బాట నువ్వేలే
నిదురలేని జీవితాన జోల పాట నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే
చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే

మేఘాలెన్నున్న ఆకాశం నువ్వేలే
రాగాలెన్నున్న అనురాగం నువ్వేలే
బంధాలెన్నున్న ఆనందం నువ్వేలే
కష్టాలెన్నున్న అదృష్టం అంటే నువ్వేలే
అలసి ఉన్న గొంతులోన మనసు మాట నువ్వేలే
అడవిలాంటి గుండెలోన తులసికోట నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే
చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే

దైవాలెన్నున్న నా ధైర్యం నువ్వేలే
స్వర్గాలెన్నున్న నా సొంతం నువ్వేలే
దీపాలెన్నున్న నా కిరణం నువ్వేలే
ఆభరణాలెనున్న నా తిలకం మాత్రం నువ్వేలే
మధురమైన భాషలోన మొదటి ప్రేమ నువ్వేలే
మరణమైన ఆశలోన మరొక జన్మ నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే
చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే



Credits
Writer(s): Devi Sri Prasad, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link