Neeku Naaku Pellanta

నీకు నాకు పెళ్ళంట నింగి నేలకు కుళ్ళంట
నీకు నాకు పెళ్ళంట నింగి నేలకు కుళ్ళంట
ఎందుకంటా?
యుగ యుగాలుగా ఉంటున్నా
అవి కలిసిందెపుడు లేదంటా
అలాగా

నీకు నాకు పెళ్ళంట నదికీ కడలికి పొంగంట
నీకు నాకు పెళ్ళంట నదికీ కడలికి పొంగంట
ఎందుకంటా?
యుగ యుగాలుగా వేరైనా అవి కలవనిదెపుడు లేదంట

నీకు నాకు పెళ్ళంట నింగి నేలకు కుళ్ళంట
నదికీ కడలికి పొంగంట

ప్రతి రేయి మనకొక తొలి రేయంట
తొలి ముద్దు పెదవులు విడిపోవంట
జగతి కంతటికి మన జంటే జంట
ఇరు సంధ్యలను ఒకటిగ చేస్తామంట
నా కంట నిను చూసుకుంటా
నీ చూపు నా రేపు పంట

నీకు నాకు పెళ్ళంట నింగి నేలకు కుళ్ళంట
నీకు నాకు పెళ్ళంట నదికీ కడలికి పొంగంట

మన కోర్కెలన్నీ పసిపాపలంట
చిగురాకు మనసుల చిరునవ్వులంట
వయసు లేనిది మన వలపేనంట
మన జీవితం ఆటాపాటేనంట
నాలోన నిను దాచుకుంటా
నీ ఊపిరై కాచుకుంట

నీకు నాకు పెళ్ళంట నదికీ కడలికి పొంగంట
యుగ యుగాలుగా వేరైనా అవి కలవనిదెపుడు లేదంట
నీకు నాకు పెళ్ళంట నదికీ కడలికి పొంగంట



Credits
Writer(s): Athreya, Shibu Chakravarthi
Lyrics powered by www.musixmatch.com

Link