Avunana Kaadana - From "Jawaan"

కొంత నన్నే కనుగొన్నానా
ఉప్పెనేదో ఎగసే లోన
పట్టుకున్నా పడిపోతున్నా
ఎందరున్నా వంటరవుతున్నా
అసలేంటీ వేదనా

అవుననా కాదనా ఉందనా లేదనా
దేనికో పేరునే పెట్టలేనా
ఓ అవుననా కాదనా ఉందనా లేదనా
దేనికో పేరునే పెట్టలేనా
ముందులా లేననా ఇంతలా మారినా
గుండెలో గుట్టుగా దాచుకోనా
అయోమయంగా ఇదేమిటో
అదే నయంగా ఉందేమిటో
అంతంటూ లేని కథేమిటో
అందంగ ఉంది అదేమిటో
ఇన్నాళ్లు నాలో ఉన్నా
అన్నీ తెలుసనుకుంటున్నా
చూస్తూనే నీలో నన్నే
నేనే కలిసిక వస్తున్నా
వద్దన్నా నువ్వే ఉంటే
కళ్లే పక్కకు లాగేనా
పర్లేదు అనుకుంటూనే
మళ్లీ చిక్కుకుపోతున్నా

అసలేంటీ వేదనా
అసలేంటీ వేదనా

సగం సగం మరో జగం
సగం సగం మరీ సుఖం
సగం సగం చెరో సగం
నువ్వో సగం నేనో సగం
సగం సగం మనోగతం
సగం సగం సహేతుకం
సగం సగం నిరంతరం
నువ్వో సగం నేనో సగం

పదమికే పెదవవుతా
నీ కళ్లకే నిదరవుతా
ఏ దిక్కునున్న ఎదురవుతా
అల్లాడితే కుదురవుతా
బాగుంది నీ గొడవా
నువ్ గోదారిలో పడవా
కల్లోనూ నన్ను విడవా
కథ అల్లేసి ముడి పడవా
వద్దన్నా నువ్వే ఉంటే
కళ్లే పక్కకు లాగేనా
పర్లేదూ అనుకుంటూనే
మళ్లీ చిక్కుకుపోతున్నా

అసలేంటీ వేదనా
అసలేంటీ వేదనా

సగం సగం మరో జగం
సగం సగం మరీ సుఖం
సగం సగం చెరో సగం
నువ్వో సగం నేనో సగం
సగం సగం మనోగతం
సగం సగం సహేతుకం
సగం సగం నిరంతరం
నువ్వో సగం నేనో సగం



Credits
Writer(s): Thaman Ss, Krishna Kanth Gundagani
Lyrics powered by www.musixmatch.com

Link